.jpg)
అప్పటి వరకు వరుస పరాజయాలతో విసిగిపోయిన రాజశేఖర్ ను తిరిగి లైమ్ లైట్ లోకి తెచ్చిన చిత్రం `గరుడవేగ`. ఈ సినిమా తర్వాత 'అ!' ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ `కల్కి` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పై ఇప్పటికే భారీ ఎక్స్ పెక్టేషన్స్ మొదలయ్యాయి. బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకు భారీ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సినిమాకు పెట్టిన దానికంటే ఎక్కువగా ఆఫర్ చేసి ఓ ప్రముఖ నిర్మాత `కల్కి` సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే శాటిలైట్ రైట్స్ విషయంలోనూ లీడింగ్ లో ఉన్న చానల్స్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే మంచి లాభాలు అందుకున్న కల్కి సినిమా మరి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.






