'గుంటూరు కారం'లో మెయిన్ హీరోయిన్ ఎవరో తెలుసా!
on Jun 21, 2023

'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా పూజ హెగ్డే, శ్రీలీల నటిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యమవ్వడం, డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వంటి కారణాలతో పూజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. పూజ తప్పుకోవడం శ్రీలీలకు బాగా కలిసొచ్చింది అంటున్నారు.
'గుంటూరు కారం'లో మొదట మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డేని, సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేశారు. అయితే పూజ తప్పుకోవడంతో ఆ స్థానంలో ఎవరిని తీసుకుంటారనే చర్చ జరుగుతుండగా.. ఆ ఛాన్స్ శ్రీలీల కొట్టేసినట్లు తెలుస్తోంది. 'పెళ్లి సందడి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల, రెండో సినిమాకే మాస్ రాజా రవితేజ సరసన 'ధమాకా'లో నటించే అవకాశం దక్కించుకుని.. ఆ సినిమా విజయంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె గ్లామర్, డ్యాన్స్ లు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. అందుకే ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఎక్కువగా యంగ్ హీరోల సరసన హీరోయిన్ గా, బిగ్ స్టార్స్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంటున్న ఆమె.. ఇప్పుడు ఏకంగా మహేష్ సరసన మెయిన్ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకోవడం పెద్ద విషయమనే చెప్పాలి. అదే సమయంలో ఆమె ఎంపిక కూడా సినిమాకి ఖచ్చితంగా ప్లస్ అయ్యే అవకాశముంది. సరైన సాంగ్స్ పడితే తన డ్యాన్స్ లతో వాటిని మరోస్థాయికి తీసుకెళ్లి మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయగల సత్తా శ్రీలీలకు ఉంది. మరి 'గుంటూరు కారం' విషయంలో శ్రీలీల ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సంయుక్త మీనన్ పేరుని పరిశీలిస్తున్నట్లు వినికిడి.
'గుంటూరు కారం' సినిమాని 2024, జనవరి 13న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మరి షూటింగ్ లో జరుగుతున్న జాప్యం కారణంగా అప్పటికి సినిమా వస్తుందో లేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



