Home

»

Latest News

'భగత్ సింగ్' జయంతి: వెండితెరపై ఆ మహా విప్లవకారుడిగా  ఏ హీరో అయితే అద్భుతంగా ఉంటుంది!

Sep 28, 2026 6:13PM


భగత్ సింగ్.. ఈ పేరు వింటే ఛాయలు యువతతో పాటు ప్రతి భారతీయుడు రక్తం సల   సల మరిగిపోతూ ఉంటుంది. నూనూగు మీసాల వయసులోనే బ్రిటిష్ సైన్యానికి భయంతో వచ్చే  చెమట సువాసనని పరిచయం చేసి ఉక్కిరి బిక్కిరి చేసాడు. మీరంటే నా చావుని డిసైడ్ చేసేది నేనే నా చావుని డిసైడ్ చేస్తానని ఉరికంబాన్ని ముద్దాడి మరి మీదకి తగిలించుకున్న భారతీయ సింహ స్వప్నం. ఈ రోజు భగత్ సింగ్ జయంతి. 

దీంతో  సామజిక మాధ్యమాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఒకవేళ మన టాలీవుడ్ వెండితెరపై భగత్ సింగ్ బయోపిక్ తెరకెక్కిస్తే, ఆ విప్లవ వీరుడి పాత్రకు ఏ టాలీవుడ్ స్టార్ హీరో సరైన న్యాయం చేయగలరు? ప్రేక్షకులు మరియు అభిమానులు ఎవరిని ఆ పాత్రలో చూడటానికి అత్యంత ఉత్సాహంగా ఉన్నారు?సామాజిక మాధ్యమాలు మరియు సినీ వేదికల్లో సాగుతున్న చర్చల ప్రకారం, దాదాపు 40% మంది నెటిజన్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరును ప్రతిపాదిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ చూపించిన రౌద్రం, కళ్ళలో కనిపించిన తీవ్రత మరియు బ్రిటిష్ వారికి ఎదురుతిరిగే ఆవేశం భగత్ సింగ్ పాత్రకు నూటికి నూరు శాతం సరిపోతాయని నెటిజన్లు భావిస్తున్నారు. ఆంగ్లేయుల కళ్లలో భయం పుట్టించే ఆ చూపులు, ఖాకీ యూనిఫామ్ లేదా విప్లవకారుడి లుక్‌లో చరణ్ పండించే తీవ్రత ప్రేక్షకులను మైమరిపిస్తుందనడంలో సందేహం లేదు.


ఇది కూడా చదవండి: దేవర 2 పై హల్ చల్ చేస్తున్న నయా రూమర్: ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి!

 

 

30 శాతం మంది  నెటిజన్లు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరుని  బలంగా వినపిస్తున్నారు. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీలోని పవర్, ఉద్వేగభరితమైన నటన మరియు కోర్టు రూమ్‌లో భగత్ సింగ్ చెప్పే విప్లవాత్మక సంభాషణలను ఎన్టీఆర్ పలికితే థియేటర్లలో రచ్చ రంబోలా ఖాయమని నమ్ముతున్నారు. 'ఇంక్విలాబ్ జిందాబాద్' అనే ఒక్క నినాదం ఎన్టీఆర్ గొంతు నుండి వస్తే అది ఇచ్చే వైబ్రేషన్స్ వేరే స్థాయిలో ఉంటాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.అదే సమయంలో, సుమారు 15% మంది సినిమా ప్రియులు నాచురల్ స్టార్ నాని పేరును కూడా సూచిస్తున్నారు. భగత్ సింగ్ కేవలం ఆవేశపడే వీరుడు మాత్రమే కాదు, తీవ్రమైన ఆలోచనాపరుడు, పుస్తక ప్రేమికుడు, మరియు మేధావి. నాని తన సహజసిద్ధమైన నటనతో భగత్ సింగ్ లోని భావోద్వేగాలను, ఆంతరంగిక సంఘర్షణను మరియు ఆలోచనా విధానాన్ని ఎంతో పరిణతితో పండించగలరని విశ్లేషిస్తున్నారు.

మిగిలిన 15% మంది అభిప్రాయాల ప్రకారం విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, లేదా వరుణ్ తేజ్ వంటి యువ కథానాయకులు కూడా తమ ఫిజిక్, గంభీరమైన స్వరం మరియు ఆటిట్యూడ్‌తో భగత్ సింగ్ పాత్రకు సరికొత్త గ్లామర్, ఉద్రేకతను తేగలరని భావిస్తున్నారు. మొత్తానికి భగత్ సింగ్ జయంతి సందర్భంగా టాలీవుడ్‌లో మొదలైన ఈ చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సరైన దర్శకుడు పడితే మన టాలీవుడ్ హీరోలలో ఎవరు చేసినా భగత్ సింగ్ చరిత్ర వెండితెరపై మరో అద్భుత కావ్యంగా నిలిచిపోవడం ఖాయం. జయహో  భగత్ సింగ్. 

 

[Which Hero suit For Bhagat singh role, Bhagat Singh Jayanti, Bhagat Singh Biopic, Ntr, Ram Charan, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com