
నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని వినూత్న రీతిలో బాలయ్యను ప్రెజెంట్ చేయడానికి కొరటాల శివ తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారనే వార్త ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని సమాచారం. అంటే తండ్రీ కొడుకులుగా రెండు విభిన్నమైన రోల్స్‌లో బాలయ్య సందడి చేయనున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవైపు పవర్‌ఫుల్ తండ్రి పాత్ర, మరొకవైపు డిఫరెంట్ షేడ్స్ ఉన్న కొడుకు పాత్రలో బాలకృష్ణ కనిపించి నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ కోసం బాలయ్య తన లుక్‌ను పూర్తిగా మార్చుకుని సరికొత్త మేకోవర్‌లో రాబోతున్నారట. ఈ భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్‌ను డిసెంబర్ మొదటి వారం నుంచే ఘనంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

'దేవర' చిత్రం తర్వాత కొరటాల శివ ఎంతో జాగ్రత్తగా, కథపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు రాజకీయ అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించబోతున్నారట.
సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య పవర్‌ఫుల్ మాస్ డైలాగ్స్, కొరటాల శివ మార్క్ కంటెంట్, ద్విపాత్రాభినయం, పొలిటికల్ టచ్.. ఈ ఎలిమెంట్స్ అన్నీ కలసి ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.
ఇది కూడా చదవండి: 400 కోట్ల బాక్సాఫీస్ సునామీ.. హనుమాన్ అంశ్ ఓటీటీ డీటెయిల్స్.!
[Balakrishna Koratala Movie Latest Update, Balakrishna Double Role, NBK112 Shooting Update, NBK112 Latest Update, Nandamuri Balakrishna, Koratala Siva, NBK 112 Movie, Telugu Film News, Telugu News]






