
2026లో బాక్సాఫీస్ వద్ద ఊహించని సంచలనం సృష్టించిన ఆధ్యాత్మిక చిత్రం 'హనుమాన్ అంశ్'. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన రోజు, తొలిరోజున రూ. 10 లక్షల ఓపెనింగ్స్ సాధించి, ఆ తర్వాత రికార్డు స్థాయి ఆధ్యాత్మిక ప్రభంజనంతో రూ.400 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
థియేటర్లలో ఈ సినిమా చూసిన భక్తులు, ప్రేక్షకులు మైమరిచిపోతున్నారు. చాలామంది థియేటర్ లోపల చెప్పులు పక్కనపెట్టి, చేతులు జోడించి పూజించినంత భక్తిశ్రద్ధలతో ఈ చిత్రాన్ని వీక్షించారంటే ఈ సినిమా సృష్టించిన మ్యాజిక్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఏకంగా రూ.100 కోట్ల భారీ ఆఫర్‌తో ఒక ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్ర సహ నిర్మాత రాగిణి సోనా స్పందించారు.
సమీప భవిష్యత్తులోనే ఓటీటీ డీల్ అనౌన్స్ చేస్తామని, కానీ రూ. 100 కోట్ల ఓటీటీ ఆఫర్ వచ్చిందనే ప్రచారంలో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా, "ఈ సినిమా డిజిటల్ రిలీజ్‌కి ఇంకా సమయం పడుతుంది" అని తేల్చి చెప్పారు.

'హనుమాన్ అంశ్' కేవలం ఒక సాధారణ సినిమా కాదు. అది బిగ్ స్క్రీన్ పై, సౌండ్ సిస్టమ్ మధ్య అనుభవించాల్సిన ఒక డివైన్ ఎక్స్‌పీరియన్స్. ఇంట్లో కూర్చుని ఓటీటీలో చూస్తే రకరకాల డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. కానీ థియేటర్‌లోని వాతావరణం, క్లైమాక్స్ సన్నివేశంలో హీరో శోభినవ్ సత్య హనుమాన్ చాలీసా పఠించే సమయంలో వచ్చే డివైన్ వైబ్స్ వీక్షకులను ఒక రకమైన ఆధ్యాత్మిక సమ్మోహనానికి గురిచేస్తాయి.
అందుకే మేకర్స్ ఈ చిత్రాన్ని వీలైనంత ఎక్కువ కాలం థియేటర్లలోనే ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో 50 రోజులను పూర్తి చేసుకొని, 100 రోజుల దిశగా దూసుకుపోతోంది. సెప్టెంబర్ 11న ఓవర్సీస్‌లో హోంబలే ఫిల్మ్స్ ద్వారా గ్రాండ్‌గా విడుదలైన తర్వాత కూడా థియేట్రికల్ రన్ బలంగా ఉండటంతో, ప్రస్తుతానికి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను హోల్డ్‌లో పెట్టారు.
'హనుమాన్ అంశ్' తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా, ఏవో కారణాల వల్ల ఆగిపోయింది. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తారేమో చూడాలి.
ఇది కూడా చదవండి: బ్రాహ్మణ పాత్ర అనగానే గుర్తుకొచ్చే హీరో ఎవరు?
[Hanuman Ansh OTT Release Update, Hanuman Ansh OTT Date, Hanuman Ansh Telugu Release, Neem Karoli Baba Biopic, Hanuman Ansh Box Office, Hanuman Ansh Digital Rights, Hanuman Ansh Movie, Vishal Chaturvedi, Telugu Film News, Telugu News]






