పుష్ప గా సూపర్ స్టార్ మహేష్ బాబు.. అభిమానులు తగ్గేదేలే
on Jun 17, 2025
ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)క్రియేటివ్ డైరెక్టర్ 'సుకుమార్'(Sukumar)కాంబోలో తెరకెక్కిన 'పుష్ప(Pushspa)పార్ట్ 1 ,పార్ట్ 2 'ఎంతగా ఘన విజయాన్ని అందుకున్నాయో తెలిసిందే. పాన్ ఇండియా వ్యాప్తంగా రికార్డు కలెక్షన్స్ సృష్టించడంతో పాటు, అల్లుఅర్జున్ కి కెరీర్ పరంగా కూడా మంచి బూస్టప్ ని తెచ్చాయి. పుష్ప సిరీస్ కి ముందు అల్లు అర్జున్ ఇమేజ్ వేరు, పుష్ప సిరీస్ తర్వాత వేరు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయాన్నీ అల్లు అర్జున్ స్వయంగా చెప్పాడు. పైగా నేషనల్ అవార్డు ని కూడా పుష్ప తెచ్చిపెట్టింది. దీన్ని బట్టి అల్లు అర్జున్ కెరీర్ కి పుష్ప ఎంత ఇంపార్టెన్స్ మూవీనో అర్ధం చేసుకోవచ్చు.
రీసెంట్ గా సోషల్ మీడియాలో' పుష్ప రెండు పార్ట్' లోని కొన్ని కీలక సన్నివేశాలని సూపర్ స్టార్ మహేష్ బాబు(Maheshbabu)రూపంతో ఏఐ(Ai)క్రియేట్ చేసారు. అంటే అల్లు అర్జున్ ప్లేస్ లో మహేష్ బాబు ఉంటాడు. రకరకాల గెటప్ లతో ఉన్న మహేష్ పుష్ప వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిమానులైతే పుష్పగా మహేష్ బాబు సూపర్ గా ఉన్నాడంటు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి తొలుత పుష్ప మూవీని మహేష్ బాబుతో తెరకెక్కించాలని సుకుమార్ అనుకున్నాడంట. కాకపోతే కొన్ని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదనే రూమర్స్ అప్పట్లో చాలానే వచ్చాయి.
మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే దర్శక ధీరుడు రాజమౌళి(Ss Rajamouli)తో చేస్తున్న మూవీ, ఆల్రెడీ ఒక షెడ్యూల్ ని జరుపుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ ని జరుపుకోవడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.మిగతా నటీ నటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
