
-బాక్స్ ఆఫీస్ కి బడా హీరోల అవసరం తెలిసిందే
-కానీ వాళ్ళు ఎందుకు అలా చేసున్నారో తెలియడం లేదంటున్న అభిమాని
-మరి ఆ అభిమాని ఆవేదన ఏంటి!
హీరో.. ఇంకొంచం ముందుకెళ్తే బడా హీరో.. సినీ కళామతల్లికి, బాక్స్ ఆఫీస్ కి దొరికిన అరుదైన వజ్రం. తన సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు రెండు వారాల పాటు తనని నమ్ముకున్న వాళ్లే కాకుండా ప్రతి ఒక్కరు ఆర్థికంగా బాగుపడతారు. ఇప్పుడంటే రెండు వారాలు, అప్పట్లో ఎన్నో వారాలు. డబ్బు లెక్కపెట్టడానికి థియేటర్స్ కి మిషన్స్ తెప్పించుకోవాల్సిన పరిస్థితి. అందుకు హీరోకి సంబంధించి మెస్మరైజ్ చేసే ఎన్నో అంశాలు ముడిపడి ఉండేవి. కానీ ఇప్పుడు ఆ అంశాలని నీరుగారుస్తున్నారని రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ అడ్డాలో కూర్చొని ఉన్న అభిమాని ఆవేదన చెందుతున్నాడు. మరి అతని ఆవేదన చూద్దాం.
లాంగ్ లాంగ్ ఎగో అనుకునే అవసరం లేకుండా మన కళ్ళ ముందు కొంత కాలం క్రితం ఉండే సినీ వాతావరణాన్ని చూస్తే, హీరో 'షో' స్టార్ట్ అయ్యింది. ఫ్యాన్స్ ,ప్రేక్షకులు మూవీలోకి లీనమయ్యారు. హీరో పోరాట దృశ్యాలు, డైలాగ్స్ తో పాటు సాంగ్స్ వచ్చాయి. ముఖ్యంగా హీరో వేసిన స్టెప్స్ సూపర్ గా ఉన్నాయి. కళ్ళు చెదిరిపోయేలా డాన్స్ చేస్తుంటే అభిమాని ఆర్పకుండా చూస్తూ తను డాన్స్ చేయాలని డిసైడ్ అవుతున్నాడు.ఆ లోపు స్టెప్ అయిపోయేసరికి 'చ' అనుకోని మళ్ళీ టికెట్ కొని వెంటనే నెక్స్ట్ షో కి వెళ్ళేవాడు. ప్రేక్షకులు కూడా ఊహించని ఆ డాన్స్ గ్రేస్ కి మైమరిచిపోయి ఇంటికెళ్లి ఏం చేస్తాములే అని మళ్ళీ టికెట్స్ కోసం లైన్ లోకి వెళ్ళేవాళ్ళు. కథ బాగోక సినిమాకి ప్లాప్ టాక్ వచ్చినా సాంగ్స్, హీరోల డాన్స్ కోసం సినిమాకి వెళ్లేవారు. అందుకే మూవీ ప్లాప్ అయినా కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్లు సాధించేది.
also read: Jananayagan: జననాయగన్ పైరసీ కేసులో నిందితుల అరెస్ట్.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ కాకుండానే పబ్లిసిటీ పేరుతో, సాంగ్ టీజర్ పేరుతో హీరో చేసే డాన్స్ మొత్తం చూపించేస్తున్నారు. ఉదాహరణకి 'పెద్ది'(Peddi)సాంగ్స్ చూడండి. బంగారం లాంటి డాన్స్ స్టెప్స్ మొత్తాన్నిచూపించేసారు. అసలు 'రైరైరా' సాంగ్ అయితే చరణ్ స్టెప్స్ మొత్తాన్ని చూపించేసారు. మరి రేపు థియేటర్ లో చరణ్ డాన్స్ కి మైమరిచిపోయి తన్మయత్వాన్ని పొందే అవకాశం అభిమానులకి, ప్రేక్షకులకి ఉంటుందా! ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులని ఆకర్షించుకోవడానికి ఆ విధంగా చేస్తున్నామని మేకర్స్ అనుకోవచ్చు. సినిమా పుట్టిన దగ్గరనుంచి జనం సినిమా చూస్తూనే ఉన్నారు. చూస్తూనే ఉంటారు. ఏ కొంత కొంత మంది కోసమో డాన్స్ మొత్తాన్ని టీజర్ పేరుతో చూపించేసి సినిమాకి అన్యాయం చేయకండి. రాబోయే బడా హీరోలు, మేకర్స్ అయినా ఈ విషయాన్నీ పరిగణలోకి తీసుకోండి. గుప్పెట్లో దాచినంత సేపే ఏదైనా వదిలేస్తే ఏమవుతుందో సినీ మేధావులకి తెలియంది కాదని ఒక సినీ అభిమాని తన ఆవేదనని తెలియచేస్తున్నాడు.







