Home

»

Latest News

OTT: ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ తో ఓటీటీని షేక్ చేస్తున్న సర్వైవల్ థ్రిల్లర్!

Apr 13, 2026

  • థియేటర్లలోకి రావాల్సిన సినిమా ఓటీటీలోకి
  • నెట్‌ఫ్లిక్స్‌లో ఊహించని ట్విస్టులతో గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సినిమా
  • సర్వైవల్ థ్రిల్లర్ 'ట్రాష్'కు బ్రహ్మరథం పడుతున్న ఆడియన్స్

భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరినీ అలరిస్తూ ప్రస్తుతం ఓటీటీని షేక్ చేస్తున్న హాలీవుడ్ మూవీ 'ట్రాష్' (Thrash). ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతోంది. థ్రిల్లర్ జోనర్‌ను, అందులోనూ ప్రతిక్షణం ఉత్కంఠ రేకెత్తించే 'సర్వైవల్ థ్రిల్లర్‌'లను ఇష్టపడే వారికి అసలైన మజాను పంచుతోంది. గూస్‌బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

ఏప్రిల్ 10న సైలెంట్‌గా నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టిన ఈ 'ట్రాష్' మూవీ, అనతికాలంలోనే ఆడియన్స్‌ను కట్టిపడేస్తోంది. వాస్తవానికి ఈ మూవీని థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే, కొన్ని అనుకోని కారణాల వల్ల ఎలాంటి హడావిడి లేకుండా డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు. 

ఇంగ్లీష్‌తో పాటుగా తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ మూవీ అందుబాటులో ఉండటంతో మన సినీ ప్రియులు కూడా దీనిపై అమితమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఊహించని ట్విస్టులు, క్షణక్షణం భయపెట్టే సీన్స్ తో ఈ వీకెండ్ కు పర్ఫెక్ట్ బింజ్ వాచ్ ఆప్షన్‌గా ఈ మూవీ నిలిచింది.

కథ విషయానికి వస్తే.. ఒక తీర ప్రాంత పట్టణంలో భయంకరమైన కుంభవృష్టి. దానికి తోడు రాకాసి అలలు విరుచుకుపడటంతో ఊరంతా చెరువులా మారిపోతుంది. ఇళ్లన్నీ నీట మునగడంతో ప్రాణభయంతో వణికిపోతున్న జనాలు ఒకవైపు అయితే, ఆ వరద నీటిలోకి ఏకంగా నరభక్షక షార్క్‌లు (Sharks) ప్రవేశించడం ఈ కథలో అసలైన ట్విస్ట్. కంటికి కనిపించిన ప్రతి ఒక్కరినీ ఆ షార్క్‌లు దారుణంగా వేటాడుతూ ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో నిండు గర్భిణీగా ఉన్న ఓ మహిళ ఆ వరదల్లో చిక్కుకుంటుంది. ఒకవైపు పురిటి నొప్పులు.. మరోవైపు ప్రాణాలు తీసేందుకు చుట్టుముట్టిన షార్క్‌లు.. ఈ భయంకరమైన పరిస్థితి నుంచి ఆమె తన బిడ్డను, తనను తాను ఎలా కాపాడుకుందనేది స్క్రీన్‌పై చూస్తేనే థ్రిల్ వస్తుంది. 

గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు టామీ విర్కోలా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఫోబ్ దైనేవర్, డిజిమోన్ హౌన్సౌ, విట్నీ పీక్ లాంటి నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం నెటిజన్లు ఈ సినిమా గురించే ఎక్కువగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ చుట్టూ సాగే షార్క్ ఎటాక్ సన్నివేశాలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెడుతున్నాయని టాక్ వినిపిస్తోంది.

మీరు రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా, గుండెల్ని పిండేసే ఉత్కంఠభరితమైన సర్వైవల్ డ్రామాను చూడాలనుకుంటే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెట్‌ఫ్లిక్స్‌లో 'ట్రాష్' సినిమాను చూసేయండి. తెలుగు ఆడియోతో సహా బెస్ట్ స్ట్రీమింగ్ క్వాలిటీలో ఉన్న ఈ మూవీ, మీకు కచ్చితంగా ఒక కొత్త సినిమాటిక్ అనుభూతిని పంచుతుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com