Home

»

Latest News

Jananayagan: జననాయగన్ పైరసీ కేసులో నిందితుల అరెస్ట్.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

Apr 13, 2026

 

 

-భారతీయ చిత్ర పరిశ్రమని కుదిపేసిన జననాయగన్ పైరసీ 
-పైరసీ కేటుగాళ్లు అరెస్ట్ 
-విచారణలో సంచలన విషయాలు తెలియనున్నాయా!

ఎవరు చేసారు.. ఎందుకు చేసారు.. అసలు సినిమా అంటే ఏమనుకుంటున్నారు.. కొన్ని కోట్ల రుపాయల ఖర్చుతో వందల మంది రేయిపగలు నిద్రాహారాలు మానుకొని కష్టపడతారు. ప్రొడ్యూసర్ ఆస్తులు తాకట్టుపెట్టి ఎక్కడెక్కడ నుంచో డబ్బుల్ని ఫైనాన్స్ కి తీసుకువస్తాడు. అలాంటిది తమని తాము మేధావులుగా భావించుకుంటు 'జననాయగన్'(JanaNayagan)ని పైరసీ చేస్తారా, ఆ పైరసీ కేటుగాళ్లు దొరికితే అసలు వదలకూడదు. ఈ మాటలన్నీ గత కొన్ని రోజుల నుంచి విజయ్ అభిమానులు, భారతీయ సినీప్రేమికులు అనుకుంటున్న మాటలు. ఇప్పుడు ఆ అపర భావి భారత మేధావులు దొరికారు. డీటెయిల్స్ చూద్దాం.

పైరసీ విషయాన్నీ సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేపట్టిన  సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నింధితులు లీక్ చేసిన డిజిటల్ మార్గాన్ని గుర్తించారు. ఆ ఆధారాల ఆధారంగానే ట్రాక్ చేసి వివిధ ప్రాంతాల్లో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసారు. వీరిలో కొందరు టెక్నికల్ సపోర్ట్‌తో సంబంధం ఉన్నవారిగా, మరికొందరు కంటెంట్‌ ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకి  అప్‌లోడ్ చేయడంలో సహకరించినవారిగా గుర్తించినట్లు సమాచారం. వ్యక్తిగతంగా కాకుండా, సాంకేతికంగా సమన్వయంతో ఈ లీక్ జరిగినట్లుగా వాళ్ళ డేటాని చూస్తే అర్ధమవుతుందని, ఈ లీక్ వెనుక ఒక వ్యవస్థకి సంబంధించిన నెట్‌వర్క్ ఉండవచ్చని పోలీసుల అనుమానం. 

 

also read: రాకా కోసం దీపికా రికార్డు రెమ్యునరేషన్!.. ముగ్గురు హీరోలని కలిపినా అన్ని కోట్లు ఇస్తారా

ప్రస్తుతం పోలీసులు నిందితులని విచారించే పనిలో ఉన్నారు వాళ్ళ ద్వారా  లీక్‌కి అసలు సూత్రధారులు ఎవరో కనిపెట్టే పనిలో ఉన్నారు. మరి వాళ్ళు కాకుండా వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే ఆసక్తి అందరిలో ఉంది. విజయ్(VIjay)తన పొలిటికల్ పార్టీ తరుపున ఈ నెల 23 న జరిగే తమిళనాడు ఎలక్షన్స్ లో పోటీ చేస్తుండటమే అందుకు కారణం.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com