అతనితో మాకు సంబంధం లేదు..ఇది నిజంగా సంచలనమే
on Feb 6, 2025
సుదీర్ఘ కాలం నుంచి చిత్ర నిర్మాణంలో అగ్రగామిగా ఉన్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'వైజయంతి మూవీస్(Vyjayanthi Movies)తెలుగు చిత్రసీమతో పాటు,తెలుగు ప్రేక్షకుల్లోఈ సంస్థకి ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.హిట్ చిత్రాలని నిర్మించడమే కాదు,ఆయా చిత్రాల ద్వారా హీరోల ఇమేజ్ ని కూడా హిమాలయ శిఖరాలకు చేర్చింది.తెలుగు చిత్ర సీమలో ఉన్న అందరి హీరోలు వైజయంతి బ్యానర్ లో సినిమా చెయ్యాలని కోరుకోవడమే కాదు,ఆయా హీరోల అభిమానులు కూడా తమ హీరో వైజయంతి బ్యానర్ లో సినిమా చెయ్యాలని కోరుకుంటారు.దీన్నిబట్టి ఆ బ్యానర్ యొక్క ఘన కీర్తిని అర్ధం చేసుకోవచ్చు.
రీసెంట్ గా హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ పోలీసులు ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న నీలేష్ చోప్రా అనే వ్యక్తిని అరెస్ట్ చెయ్యడం జరిగింది.దీంతో అతను వైజయంతి మూవీస్ లో వర్క్ చేస్తున్నాడనే కథనాలు కొన్ని మీడియా ఛానెల్స్ తో పాటు సోషల్ మీడియాలో వినిపిస్తూ వచ్చాయి.ఇప్పుడు ఈ వార్తలపై వైజయంతి మూవీస్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు నీలేష్ కి మా సంస్థకి ఎలాంటి సంబంధం లేదు.ఈ విషయంపై పోలీసు అధికారులతో కూడా చర్చించాం.ఒక వార్తని ప్రచురించే ముందుకు నిజానిజాలు తెలుసుకోవాలంటూ ఎక్స్ వేదికగా తెలిపింది.ఎన్టీఆర్(Ntr)ఏఎన్ఆర్(Anr)చిరంజీవి(Chiranjeevi)నాగార్జున(Nagarjuna)వంటి హీరోలతో హిట్ చిత్రాలు నిర్మించిన ఈ సంస్థ గత ఏడాది ప్రభాస్(Prabhas)తో కల్కి 2898 ఏడి తెరకెక్కించి భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
