Home

»

Latest News

స్వాగ్ ఆఫ్ అర్జున్: ‘వృషకర్మ’ సాంగ్ మీనింగ్ తెలుసా.?

Nov 8, 2026 4:52PM

అక్కినేని హీరో నాగచైతన్య అప్ కమింగ్ మూవీ ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఆకట్టుకుంటోంది.

‘వృషకర్మ’ సినిమాలో నాగచైతన్య అర్జున్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ పాట ద్వారా ఆ పాత్ర స్వభావాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అర్జున్ ఒక ట్రెజర్ హంటర్‌గా కనిపిస్తున్నాడు. తెలియని ప్రదేశాల్లోకి వెళ్లడం, గుహల్లో అన్వేషణ చేయడం, ప్రమాదాలను ఎదుర్కోవడం వంటి సాహసాలు చేసే వ్యక్తిగా అతడి పాత్రను చూపించారు.

పాట మొదలైనప్పటి నుంచే అర్జున్ క్యారెక్టర్‌లోని కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. చీకటిలో కూడా తన చూపులతో వెలుగులు నింపాలనే భావన, తన ముందు ఎలాంటి సవాళ్లు నిలవలేవనే ధీమా.. ఇలా ప్రతి లైన్‌లోనూ అతడి ఆటిట్యూడ్‌ను చూపించే ప్రయత్నం చేశారు.

ప్రణవ్ చాగంటి రాసిన సాహిత్యంలో అర్జున్ వ్యక్తిత్వాన్ని హైలైట్ చేశారు. తనలో పుట్టుకతోనే స్వాగ్ ఉందని, తన ప్రయాణంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పే భావన పాటలో కనిపిస్తుంది.

ముఖ్యంగా ‘సూరీడే చిమ్మచీకట్లో నా చూపుల్లో ఉదయించాలి’ అనే భావం అర్జున్ ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది. చీకటి ఎంతటి సవాలుగా ఎదురైనా తన దృష్టి, ధైర్యంతో దాన్ని అధిగమించగలననే అర్థం ఇందులో ఉంది. అలాగే సునామీ కూడా తలవంచాలనే భావనతో తన బలాన్ని అతిశయోక్తిగా వర్ణించారు.

‘I'm Born To Rule’ అనే ఇంగ్లీష్ హుక్ లైన్ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. తాను పరిస్థితులకు లొంగిపోయే వ్యక్తిని కాదని, తనదైన ప్రపంచాన్ని సృష్టించుకునే నాయకుడిననే అర్జున్ మనస్తత్వాన్ని ఈ లైన్ ప్రతిబింబిస్తుంది. మొత్తంగా ఈ పాట ఒక సాహసికుడి ఆత్మవిశ్వాసం, ధైర్యం, గెలవాలనే పట్టుదల చుట్టూ సాగుతుంది.

‘కాంతార’, ‘విరూపాక్ష’ వంటి సినిమాలతో తన సంగీతంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజనీష్ లోక్‌నాథ్ ఈ పాటకు సంగీతం అందించడమే కాకుండా స్వయంగా పాడారు. ట్రెండీ బీట్స్, టెక్నో గిటార్ రిథమ్స్‌తో పాటను ఎనర్జిటిక్‌గా కంపోజ్ చేశారు. పాటలోని బీట్స్ అర్జున్ పాత్రకు ఉన్న స్టైల్, ఆటిట్యూడ్‌కు సరిపోయేలా ఉన్నాయి. 

‘విరూపాక్ష’తో హారర్ థ్రిల్లర్‌లో తన మార్క్ చూపించిన దర్శకుడు కార్తీక్ దండు.. ఈసారి మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌తో వస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా, స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. డిసెంబర్ 4న విడుదల కానున్న ఈ సినిమా కోసం ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ మంచి మ్యూజికల్ స్టార్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు.

- Swag of Arjun Lyrical Video 

 

 

 

[Vrushakarma Movie, Swag of Arjun Song, Naga Chaitanya, Ajaneesh Loknath, Karthik Dandu, Meenakshi Chaudhary, Telugu Songs 2026, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com