Home

»

Latest News

రజనీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని: అదిరిపోయే గ్లింప్స్‌తో అఫీషియల్ అనౌన్స్‌మెంట్.!

Nov 8, 2026 4:00PM

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ధర్మన్’ సినిమాలో రామ్ నటిస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) ఈ విషయాన్ని వెల్లడించింది.

అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ పోతినేని నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. రాశీ ఖన్నాకు జోడీగా రజనీకాంత్‌కు అల్లుడి పాత్రలో నటిస్తాడని, అలాగే నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని రకరకాల ప్రచారాలు జరిగాయి. రామ్ రోల్ ఏంటనేది రివీల్ చేయలేదు కానీ, ‘ధర్మన్’లో రామ్ నటిస్తున్నట్లు అదిరిపోయే గ్లింప్స్‌తో అనౌన్స్‌మెంట్ వచ్చింది.

ఈ సినిమాలో రజనీకాంత్ సరసన సిమ్రన్ నటిస్తుండగా.. రాశీ ఖన్నా, నయనతార, శ్రీలీల, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. 2027 ఏప్రిల్‌లో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రామ్ పోతినేని గతంలో ‘ది వారియర్’ సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇప్పుడు నేరుగా రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్‌తో కలిసి నటించే అవకాశం రావడం ఆయన కెరీర్‌లో మరో ముఖ్యమైన అడుగుగా చెప్పొచ్చు. మరి ‘ధర్మన్’లో రామ్ పాత్ర ఎలా ఉండబోతోంది? రజనీతో ఆయన స్క్రీన్ షేరింగ్ ఎలా ఉండబోతోంది? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

 

 

 

[Ram Pothineni In Dharman, Superstar Rajinikanth, Dharman Movie, Ram Pothineni, Kamal Haasan, Ashwath Marimuthu, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com