మెగాస్టార్ 'విశ్వంభర'.. వామ్మో 75 కోట్లా..!
on Apr 20, 2025
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
'విశ్వంభర'ను మొదట 2025 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. అయితే ఈ మూవీ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ కంపెనీలతో ప్రతిష్టాత్మకంగా వీఎఫ్ఎక్స్ వర్క్ చేయిస్తున్నారు. దీని కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట. వీఎఫ్ఎక్స్ కోసం ఇంత ఖర్చు చేస్తున్నారంటే.. అవుట్ పుట్ ఏ రేంజ్ లో ఉంటుంది అనే ఆసక్తి కలుగుతోంది.
మరోవైపు 'విశ్వంభర'ను జులై 24న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ కెరీర్ లో ఈ డేట్ కి ప్రత్యేకత ఉంది. ఆయన నటించిన ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ 'ఇంద్ర' 2002 లో జులై 24నే విడుదలైంది. సెంటిమెంట్ డేట్ కి వస్తున్న చిరంజీవి.. అదే రిజల్ట్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి.
ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న 'విశ్వంభర' సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఛోటా కె. నాయుడు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్స్ గా వ్యవహరిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
