తిరుమల టోకెన్స్ పై విశ్వక్ సేన్ కీలక వ్యాఖ్యలు
on Dec 27, 2025

-విశ్వక్ సేన్ ఏం చెప్తున్నాడు
-తిరుమల టోకెన్స్ డీటెయిల్స్ ఇవే
-వీడియో వైరల్
వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadashi)నాడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన కరుణా కటాక్షాలు పొందాలని భక్తులందరు తెల్లవారు జామునుంచే పెద్ద ఎత్తున ఆలయాలకి తరలి వెళ్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలోని ఆలయాలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాలన్నీ అత్యంత రద్దీతో కిటకిటలాడుతుంటాయి. ఆ ఆలయాలన్నీ ఒక ఎత్తయితే పరమ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కటే ఒక ఎత్తు. ఏడుకొండలలో కొలువై ఉన్న ఆ స్వామిని వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకోవాలనే ఆశ ప్రతి ఒక్కభక్తుడిలో ఉంటుంది. దీంతో ప్రతి వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు తిరుమల బాట పట్టి దర్శనం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు ఈ విషయంపై ప్రముఖ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen)సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసిన వీడియోలో భక్తులకి కొన్ని సూచనలు చేస్తున్నాడు.
Also read: ఘనంగా జరిగిన సల్మాన్ ఖాన్ 60 వ పుట్టిన రోజు.. పెళ్లి న్యూస్ ఇదే
సదరు వీడియోలో విశ్వక్ సేన్ మాట్లాడుతు డిసెంబర్ 30 , 31 , 1 వ తేదీల్లో తిరుమల(Tirumala)వెళ్లే భక్తులు టోకెన్స్ ఉంటేనే దర్శనానికి వెళ్ళండి. టోకెన్స్ లేకుండా మాత్రం వెళ్లి ఇబ్బందులు పడకండి. సపోర్ట్ టీటీడీ అని చెప్పడం జరిగింది. ఇక టీటీడీ కూడా భక్తులకి విజ్ఞప్తి చేస్తు ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు పది రోజుల పాటు స్వామి దర్శనానికి అనుమతి ఉంటుంది. ఈ పది రోజులు వైకుంఠ ఏకాదశి లాగా సమాన పవిత్రత కలదు. కాబట్టి ఏ రోజు దర్శనం చేసుకున్నాఒకే రకమైన పుణ్యఫలం లభిస్తుందని టీటీడీ అధికార ప్రకటన చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



