Home

»

Latest News

విలన్ గా నటిస్తానంటున్న మంచు కుర్రాడు!

Jun 27, 2016 4:53PM

ఇక హీరోగా ప్రేక్షకులపై దండయాత్రలు చేయడం ఎందుకనుకొన్నాడో లేక నిజంగానే నటుడిగా సరికొత్త ప్రయోగాలు చేయాలని ఫిక్సయ్యాడో తెలియదుగానీ.. మంచు వారి హీరో మంచు విష్ణు "నేను విలన్ గా నటిస్తా" అంటున్నాడు. ఇటీవల విష్ణుకు తమిళం నుంచి ఒక భారీ బడ్జెట్ సినిమాలో విలన్ ఆఫర్ వచ్చిందట. భారీ బడ్జెట్ సినిమా మరియు తమిళనాట స్టార్ హీరో నటిస్తుండడంతోపాటు తమ కుటుంబానికి దగ్గరవారు కావడంతో విష్ణు ఆ విలన్ ఆఫర్ ను స్వీకరించాడని తెలుస్తోంది.

మంచు విష్ణు హీరోగా నటించిన "ఈడోరకం ఆడోరకం" సినిమా హిట్ అయినప్పటికీ, అది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను మాత్రమే ఆకట్టుకోవడం, కార్తీక్ దర్శకత్వంలో మొదలైన మరో సినిమా ఆగిపోవడంతో.. విష్ణు ఇకపై విలన్ గా, నిర్మాతగా కంటిన్యూ అవ్వాలని ఫిక్స్ అయినట్లు మంచు సన్నిహితుల సమాచారం!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com