Home

»

Latest News

ఆ హీరో సైలెన్స్ భరించలేకపోతున్నారు!

Jun 27, 2016 4:22PM

రవితేజ అంటే మొదటగా గుర్తొచ్చేది ఆయన మాస్ డైలాగ్స్, స్పీడ్. ఆయన్ని మాస్  మహారాజా చేసింది కూడా ఆయన దూకుడే. సినిమాలో బయటా యమా ఫాస్ట్ గా వుంటారాయన. సినిమాలు సెట్ చేయడంలో కూడా అదే స్పీడు.  ఓ సినిమా పూర్తయ్యేలోగా మరో సినిమా సెట్స్ పైకి వెళ్ళిపోతుంటుంది. అయితే ఇప్పుడు రవితేజ కొత్త సినిమా విషయంలో జరుగుతున్న జాప్యం చర్చనీయంశమైయింది.

"బెంగాల్ టైగర్" తర్వాత మళ్లీ కెమరా ముందుకు రాలేదు రవితేజ.  త్వరలోనే ‘రాబిన్ వుడ్’అంటున్నారే గానీ సెట్స్ పైకి వెళ్ళే డేట్ చెప్పడం లేదు. దిల్ రాజు బ్యానర్ లో చేయాలనుకొన్న ఎవడో ఒకడు ఎప్పుడైతే క్యాన్సిల్ అయ్యిందో అప్పట్నుంచి రవితేజ కొంచెం పర్శనల్ గా డిస్టర్బ్ అయ్యారని కొందరు చెబుతున్నారు. అలాంటిందేమీ లేదు.. ఒకేసారి నాలుగైదు ప్రాజెక్టులకి సరిపడా కథల్ని సిద్ధం చేయించే పనిలో ఉన్నాడని మరి కొందరు అంటున్నారు. అసలు కథ ఏమిటో గానీ.. రవితేజ సైలెన్స్ ను మాత్రం ఆయన అభిమానులు భరించలేకపోతున్నారు. మరి ఆయన మౌనం ఎప్పుడు వీడుతాడో..!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com