Home

»

Latest News

"దేవుడే దిగి వచ్చినా" ఆపేదిలేదంటున్న పవన్

Jun 27, 2016 5:06PM

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న హ్యాట్రిక్ సినిమా కి టైటిల్ ఫిక్స్ అయిపోయిందట. దాసరి నారాయణరావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమాకి నాగార్జున "సంతోషం" సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ "దేవుడే దిగి వచ్చినా" అనే పల్లవితో సాగే పాటను టైటిల్ గా ఎంచుకొన్నారని తెలుస్తోంది. టైటిల్ కూడా రిజిష్టర్ చేయించేశారట.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో "కడప కింగ్" (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటించేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తాడు పవన్ కళ్యాణ్!  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com