విష్ణుప్రియ నడుము తమలపాకు
on Jul 28, 2022

ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్ ఉంటుంది. హీరోయిన్స్ ని ఆడియన్స్ కి బాగా చూపించాలి అనే కాన్సెప్ట్ ఎక్కువగా వారిలో కనిపిస్తుంది. డైరెక్టర్ వంశీది ఒక రకమైన స్టైల్, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుది ఒక స్టైల్. రొమాంటిక్ సాంగ్స్ లో హీరోయిన్స్ ని చూపించే విధానం చాలా బాగుంటుంది. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు మంచి పేరు తెచుకున్నారంటే అది రాఘవేంద్ర రావు సినిమాల్లో చేసిన పాటల వల్ల అని కూడా చెప్పొచ్చు. హీరోయిన్స్ నాభి, నడుము మీద పళ్ళు, పూలు పెట్టడం..ఇలా ఎన్నో రొమాంటిక్ సాంగ్స్ లో హీరోయిన్స్ అందాలని ప్రేక్షకులకు చూపించడంలో దర్శకేంద్రుడిది అందెవేసిన చేయి. ఒకప్పటి, విజయశాంతి, రమ్యకృష్ణ, రంభ, నగ్మా వంటి ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఈయన పాటలో పడి మెరిసినవారే. జెనెరేషన్స్ మారినా ఆయన స్టయిల్లో ఎలాంటి మార్పు లేదు. తర్వాతి తరంలో త్రిష, శ్రేయ, తాప్సి వంటి వాళ్ళ మీద కూడా ఈ ప్రయోగాలు చేశారాయన.

ఐతే ఈ రోజుల్లో నడుము చూపించడం పెద్ద విషయం కాదు అన్నట్టుగా ఐపోయింది ఇండస్ట్రీలో . కాబట్టి దర్శకేంద్రుడు కూడా ఆయన స్టైల్ ని రొటీన్ కి భిన్నంగా మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆయనకు మాత్రం ఆ భావాలకు మనసు నుంచి ఇంకా పోలేదేమో కొంత ఆ వాసన ఇంకా మిగిలే వుంది అనడానికి ఈ పోస్టరే నిదర్శనం. ఆయన ఇప్పుడు వాంటెడ్ పండుగాడ్ టైటిల్ తో ఒక మూవీ తీశారు. ఈ మూవీలో ఫస్ట్ టైం నటించిన విష్ణు ప్రియా లుక్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లోన నాభికి తమలపాకు మడిచి పెట్టినట్టు కనిపిస్తుంది. ఆయన నమ్మిన సక్సెస్ ఫార్ములాని ఈ జెనెరేషన్ లో విష్ణుప్రియ మీద ప్రయోగించారు. సోషల్ మీడియాలో విష్ణు ప్రియా తమలపాకు లుక్ పోస్టర్ వైరల్ గా మారింది. ఈ మూవీలో విష్ణు శృతి క్యారెక్టర్ లో నటిస్తోంది. ఆగష్టు 12 న ఈ మూవీ రిలీజ్ కానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ అలరించబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



