
విజయ్(Vijay)తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని నెరవేర్చే పనిలో భాగంగా దశలవారీ మద్యపాన నిషేధానికి శ్రీకారం చేపట్టారు. అందులో భాగంగా రాష్ట్రంలోని పాఠశాలలు, ఆలయాలు సమీపంలో ఉన్న సుమారు 717 మద్యం దుకాణాలని తక్షణమే మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశాడు.
విజయ్ తీసుకున్న ఆ సాహసోపేతమైన నిర్ణయంపై విశాల్(Vishal)ఎక్స్ వేదికగా స్పందిస్తు 'హ్యాట్సాఫ్ టు సీఎం విజయ్ సర్. మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. పాఠశాలల సమీపంలో ఉన్న 717 వైన్ షాపులని మూసి వేస్తునట్టు మీరు తీసుకున్న నిర్ణయం అద్భుతం. దీని వల్ల ఎంతో మంది ఆడపిల్లలకి వేధింపుల నుండి విముక్తి లభిస్తుంది. వైన్ షాప్ ల వల్ల స్కూల్స్ కి వెళ్లే చిన్న పిల్లలు ఎదుర్కుంటున్న సమస్యలని నేను కళ్లారా చూశాను. ఒక గొప్ప మార్పుకి ఇది ఆరంభం అని ఎక్స్ వేదికగా తెలిపాడు. .
Also read: Peddi: బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ట్రైలర్ తర్వాత ఊహించని గిఫ్ట్





