అది పూర్తయితేనే విశాల్ పెళ్లి.. అనుకున్నదే అయ్యింది
on Aug 30, 2025

సుదీర్ఘ కాలం నుంచి చిత్ర పరిశ్రమలో ఉంటు, తమ నటనతో అశేష అభిమానులని సంపాదించుకున్న ప్రముఖ హీరో హీరోయిన్లు విశాల్(Vishal),సాయి ధన్సిక(Sai Dhanshika)ల ఎంగేజ్మెంట్ నిన్న ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది.ఈ వేడుక గురించి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిన్న తన పుట్టిన సంధర్భంగా జరిగిందని ,ఎంగేజ్‌మెంట్ ఫోటోలని సోషల్ మీడియా ద్వారా వెల్లడి చేసాడు.
ఇక ఎంగేజ్ మెంట్ అనంతరం విశాల్ మాట్లాడుతు బ్యాచిలర్ గా ఇదే నా చివరి పుట్టిన రోజు. నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఈ విషయం ఎన్నో సార్లు చెప్పాను. ధన్సిక కూడా అందుకు అంగీకరించడంతో తిమ్మిది సంవత్సరాలు పెళ్లి కోసం ఆగాము. మరో రెండు నెలల్లో నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తి కానుంది. భవనం ప్రారంభోత్సవం జరగగానే పెళ్లి డేట్ ని చెప్తాను. నడియార్ సంఘం లో జరిగే ఫస్ట్ పెళ్లి మాదే అని చెప్పుకొచ్చాడు.
'నడిగర్ సంఘం'(Nadigar Sangam)అనేది తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన కళాకారుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సంస్థ. ఈ సంఘానికి ఒక భవనం ఉండాలని ఎంతో మంది కళాకారులు ఎప్పట్నుంచో ఆశపడుతున్నారు. సుదీర్ఘ కాలం నుంచి ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని చివరకి తుది దశ నిర్మాణంలో ఉంది. టి నగర్ లో ఉన్న నడిగర్ సంఘానికి విశాల్ ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. సుమారు 25 కోట్లతో నిర్మాణం జరుపుకుంటుందని అంచనా.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



