సూర్య తండ్రిపై విశాల్ కీలక వ్యాఖ్యలు
on Apr 25, 2025
స్టార్ హీరో సూర్య(Suriya)మే 1 న 'రెట్రో'(Retro)మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో లాంచ్ కార్యక్రమం చెన్నైలో అభిమానుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకి సూర్య తండ్రి ఒకప్పటి హీరో శివకుమార్(Sivakumar)హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తమిళ చిత్ర పరిశ్రమలో ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ బాడీతో సిల్వర్ స్క్రీన్ పై కనపడిన తొలి హీరో నా కొడుకు సూర్య నే అని చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన మాటలు తమిళ చిత్ర పరిశ్రమలో వైరల్ గా మారాయి.
రీసెంట్ గా విశాల్ ఒక ఇంటర్వ్యూలో శివకుమార్(Sivakumar)చేసిన వ్యాక్యలపై మాట్లాడుతు తమిళ చిత్ర పరిశ్రమలో ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ బాడీని ట్రై చేసింది ధనుష్. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన 'పొల్లధావన్' లో ఆ విధంగా కనపడ్డాడు. నేను కూడా 'సత్యం' అనే సినిమాతో పాటు 'మదగజరాజ' లోను సిక్స్ ప్యాక్ తో కనిపించాను. బహుశా ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయిఉండవచ్చని చెప్పుకొచ్చాడు. విశాల్ ఈ ఏడాది జనవరిలో 'మదగజరాజ' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2012 లో షూటింగ్ ని జరుపుకున్న ఈ మూవీ పన్నెండు ఏళ్ళ తర్వాత రిలీజ్ అయ్యింది. అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా చేసారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
