విరాటపాలెం వెబ్ సిరీస్ రివ్యూ
on Jun 27, 2025
వెబ్ సిరీస్ : విరాటపాలెం
నటీనటులు: అభిజ్ఞ ఊతలూరు, చరణ్ లక్కరాజు, రామరాజు, లావణ్య సహుకార, గౌతమ్ రాజు, సతీష్ తదితరులు
ఎడిటింగ్: ఫరూఖ్ హుందేకర్
మ్యూజిక్: మిహిరాంశ్
సినిమాటోగ్రఫీ: మహేష్ కె స్వరూప్
నిర్మాతలు: కె.వి శ్రీరామ్
దర్శకత్వం: పోలూరు కృష్ణ
ఓటీటీ: జీ5
కథ:
అది 'ఒంగోలు' పరిధిలోని 'విరాటపాలెం' అనే గ్రామం. ఆ గ్రామ ప్రజలకు సర్పంచ్ (రామరాజు) పట్ల పూర్తి విశ్వాసం ఉంటుంది. ఆయనకి ఒక కొడుకు .. భ్రమరాంబ (లావణ్య) అనే కూతురు ఉంటారు. పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ఆమె, మేడపై గదిలో నుంచి బయటికి రావడానికి ఎంత మాత్రం ఇష్టపడదు. ఇక అదే గ్రామంలో రాజకీయంగా మంచి పలుకుబడి కలిగిన నరసయ్య, 'టింబర్ డిపో'ను నడుపుతుంటాడు. సర్పంచ్ కంటే అతనికే అక్కడివారు భయపడుతూ ఉంటారు. ఆ సమయంలో కానిస్టేబుల్ మీనా(అభిజ్ఞ) ఆ ఊరికి ట్రాన్సఫర్ అయి వస్తుంది. అక్కడికి వచ్చాక మల్లి చావు చూసి మీనా షాక్ అవుతుంది. అసలు గతంలో ఆ ఊళ్ళో ఏం జరిగింది? మీనాకి లైఫ్ ఎలా మారిందనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే
విశ్లేషణ:
విరాటపాలెంలో జరుగుతున్న మరణాల మిస్టరీని చేధిస్తూ సాగే కథ ఇది. మొదటి ఎపిసోడ్ నుండి ఏడో ఎపిసోడ్ వరకు ఈ సిరీస్ ఎంగేజింగ్ గా సాగుతుంది. చిన్న పాయింట్ ని చక్కని స్క్రీన్ ప్లే తో ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
గ్రామీణ నేపథ్యంలో సాగే కథ అవ్వడంతో అక్కడి ప్రజలు ఎలా ఉంటారు. వారి నమ్మకాలు, మూఢనమ్మకాలు అన్నీ చూపించాడు. ప్రతీ మరణం వెనుక ఏదో రహస్యం ఉందని, దాని వెనుక ఉన్న అసలు నిజాలు తెలుసుకోవడానికి మీనా పాత్రని బలంగా చూపించాడు దర్శకుడు. ఆ పాత్ర చుట్టూ సాగే సీక్వెన్స్ అంతా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఏడు ఎపిసోడ్ లలో కొన్ని లాజిక్ లు వదిలేస్తే సింపుల్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ ని చూసేయొచ్చు. క్లైమాక్స్ చాలా సిల్లీగా అనిపిస్తుంది.
ఈ సిరీస్ లో కొన్ని పాత్రలని చూస్తే మొదట మాములుగా అనిపించినా తర్వాత ఆ పాత్రల ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అయితే కొన్ని పాత్రల డైలాగ్స్ మాములుగా అనిపిస్తాయి.. ఇంకాస్త గ్రిస్పింగ్ గా రాయొచ్చు కదా అన్న ఫీల్ కలుగుతుంది. సిరీస్ ముగిసేనాటికి అన్నింటిని మీనా లింక్ చేసిన విధానం ఒకే అనిపిస్తుంది. అనవసర సీన్లు లేకుండా, ఎక్కువ ల్యాగ్ లేకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. బిజిఎమ్ అక్కడక్కడ బాగుంది. అడల్ట్ సీన్లు లేవు. కొన్ని చోట్ల ఫైట్ లో బిజిఎమ్ తేలిపోయింది. సినిమాటోగ్రఫీ ఈ సిరీస్ కి ప్రధాన బలం. ఎడిటింగ్ నీట్ గా ఉంది. ఎంగేజింగ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి అంతగా నచ్చకపోవచ్చు. ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ చూసేయొచ్చు.
నటీనటుల పనితీరు:
మీనాగా అభిజ్ఞ నటన సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచింది. భ్రమరాంబగా లావణ్య, సర్పంచ్ గా రామరాజు, నర్సయ్య తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : వన్ టైమ్ వాచెబుల్.
రేటింగ్: 2.5 / 5
✍️. దాసరి మల్లేష్

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
