పవర్ స్టార్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!
on Feb 24, 2023

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో ముందుగా ఎప్పుడో క్రిష్ దర్శకత్వంలో ప్రారంభించిన 'హరి హర వీరమల్లు' సినిమా విడుదలవుతుందని భావించారంతా. కానీ ఆ సినిమా ఇప్పటికీ సగమే షూటింగ్ పూర్తయింది. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ' సినిమాలను కూడా ప్రకటించాడు పవన్. 'హరి హర వీరమల్లు' కంటే ఈ రెండు సినిమాలే ముందు విడుదలయ్యే అవకాశముందని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఆ సినిమాల కంటే కూడా ముందే మరో సినిమా రానుందని తెలుస్తోంది.
తమిళ్ మూవీ 'వినోదయ సీతం' తెలుగు రీమేక్ లో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. అంతేకాదు అప్పుడే ఈ చిత్ర విడుదల తేదీ కూడా ఖరారైందని న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రం కోసం పవన్ కేవలం నెలరోజులు మాత్రమే డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. పవన్ పాత్ర తాలూకు షూటింగ్ ని చకచకా పూర్తి చేసి, అదే స్పీడ్ లో మూవీ షూటింగ్ ని కూడా పూర్తి చేసి ఆరు నెలల్లోనే సినిమాని విడుదల చేయాలని చూస్తున్నారట. ఆగస్టులో ఈ సినిమాని విడుదల చేసే యోచనలో మేకర్స్ ఉన్నారని, ముఖ్యంగా ఆగస్టు 11వ తేదీని పరిశీలిస్తున్నారని ఇన్ సైడ్ టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



