సమ్మర్ లో విక్రమ్ డబుల్ ధమాకా!?
on Mar 6, 2022

రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన `మహాన్`లో మరోమారు తన అభినయంతో ఆకట్టుకున్నాడు కోలీవుడ్ స్టార్ `చియాన్` విక్రమ్. ఇందులో తన తనయుడు ధ్రువ్ తో కలిసి ఎంటర్టైన్ చేశాడాయన. కట్ చేస్తే.. ఈ వేసవిలో రెండు ఆసక్తికరమైన చిత్రాలతో పలకరించేందుకు సిద్ధమవుతున్నాడీ వెర్సటైల్ స్టార్.
ఆ వివరాల్లోకి వెళితే.. టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్. అజయ్ జ్ఞానముత్తు కాంబినేషన్ లో విక్రమ్ నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ `కోబ్రా` సమ్మర్ స్పెషల్ గా మే 26న రిలీజ్ కానుంది. `కేజీఎఫ్` భామ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాకి స్వరమాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ బాణీలు అందించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ `కోబ్రా` రిలీజ్ కానుందని సమాచారం.
కాగా, 2022 వేసవిలోనే విక్రమ్ నటించిన మరో చిత్రం `ధ్రువ నక్షత్రం` ఎంటర్టైన్ చేయనుందని టాక్. వెర్సటైల్ కెప్టెన్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ రూపొందించిన ఈ స్పై థ్రిల్లర్ లో రీతూ వర్మ నాయికగా నటించగా సిమ్రాన్, రాధిక, ఐశ్వర్యా రాజేశ్ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. స్టార్ కంపోజర్ హ్యారీస్ జైరాజ్ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు. ఈ పాటికే విడుదల కావాల్సిన ఈ డీలే ప్రాజెక్ట్.. ఈ సమ్మర్ లో రిలీజ్ కావడం పక్కా అంటున్నారు తమిళ తంబీలు. మరి.. వేసవిలో రాబోతున్న ఈ రెండు సినిమాలతో విక్రమ్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
ఇదిలా ఉంటే, లెజండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో విక్రమ్ నటించిన `పొన్నియన్ సెల్వన్` తాలూకు తొలి భాగం `పి.ఎస్ః 1` ఈ ఏడాది సెప్టెంబర్ 30న పలు భాషల్లో తెరపైకి రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



