350 కోట్ల క్లబ్ లో 'విక్రమ్'.. 'బాహుబలి-2' రికార్డు బ్రేక్!
on Jun 19, 2022

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషించిన 'విక్రమ్' మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా రూ.350 కోట్ల క్లబ్ లో చేరింది. జూన్ 3న విడుదలైన ఈ సినిమా 16 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.353.55 కోట్ల గ్రాస్ రాబట్టింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 16 రోజుల్లో తమిళనాడులో 153.90 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 26.25 కోట్లు, కర్ణాటకలో 18.55 కోట్లు, కేరళలో 34.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 8.70 కోట్లు, ఓవర్సీస్ లో 112.05 కోట్ల గ్రాస్ తో విక్రమ్ మూవీ సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా 16 రోజుల్లో ఈ సినిమా 176.20 కోట్ల షేర్(353.55 కోట్ల గ్రాస్) రాబట్టింది. వరల్డ్ వైడ్ గా 100 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటికే బయ్యర్లకు 70 కోట్లకు పైగా లాభాలను తీసుకురావడం విశేషం.
ఇక తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల బిజినెస్ చేసిన విక్రమ్ 16 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 15.03 కోట్ల షేర్(26.25 కోట్ల గ్రాస్) రాబట్టి భారీ లాభాలతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇదిలా ఉంటే తమిళనాడులో రూ.147 కోట్లతో అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమాగా ఐదేళ్లుగా 'బాహుబలి-2'(2017) ఉండగా.. ఇప్పుడు ఆ రికార్డుని బ్రేక్ చేసిన విక్రమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



