లియో కోసం విజయ్ అలా సెట్ చేశారు!
on Jun 7, 2023
విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా లియో. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. త్రిష ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్, మిస్కిన్, ఎస్.జె.సూర్య కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్‌లో అత్యంత భారీగా జరిగింది. సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ కేరక్టర్లు సినిమాకు ప్రాణం. ఇప్పుడు లేటెస్ట్ షెడ్యూల్‌ని చెన్నైలో ప్లాన్ చేశారు. చెన్నైలో విజయ్ ఇంట్రడక్షన్ సాంగ్‌ని షూట్ చేస్తున్నారు. ముందు వీధుల్లో తీద్దాం అనుకున్నారు. అయితే విజయ్‌కి ఉన్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకుని సెట్ వేశారు. అత్యంత భారీగా ఈ సెట్ రూపొందిందని అంటున్నారు యూనిట్ మెంబర్స్. ప్రతిరోజూ దాదాపు 500 మంది డ్యాన్సర్లు ఈ సెట్లో డ్యాన్స్ చేస్తున్నారంటేనే ఆ గ్రాండియర్‌నెస్‌ని అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ పాటకు దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాటలో విజయ్ కాస్ట్యూమ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ల కాస్ట్యూమ్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అని అంటున్నారు మేకర్స్. విజయ్ కెరీర్‌లోనే అత్యధిక రోజులు షూటింగ్ చేసుకుంటున్న ఇంట్రడక్షన్ సాంగ్ అని ప్రచారం జరుగుతోంది.
సంక్రాంతికి విడుదలైన వారసుడు సినిమాలో ఇంట్లో ఆఖరి అబ్బాయిగా నటించారు విజయ్. పూర్తిగా కుటుంబ విలువలతో కూడుకున్న కథతో తెరకెక్కింది వారసుడు. కానీ లియో అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉండనుంది. బ్లడీ స్వీట్ అంటూ సినిమాకు సంబంధించి లోకేష్ కనగరాజ్ ఇచ్చిన హింట్ దళపతి ఫ్యాన్స్ ని నిలవనీయడం లేదు. ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్‌స్టర్ రోల్ చేస్తున్నారు. అక్టోబర్ 19న విడుదల కానుంది లియో. అనిరుద్ ఇప్పటికే కంపోజ్ కంప్లీట్ చేశారు. త్వరలోనే డబ్బింగ్, రీరికార్డింగ్ పనులు కూడా స్టార్ట్ చేయాలన్నది లోకేష్ ప్లాన్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
