కర్ణాటక సీఎం బయోపిక్‌లో విజయ్ సేతుపతి?
on Aug 3, 2023

చాలెంజింగ్ రోల్స్ గురించి ఎక్కడ విన్నా, వెంటనే విజయ్ సేతుపతి పేరు కూడా వినిపించి తీరుతుంది. సూపర్ డీలక్స్ నుంచి విజయ్ సేతుపతి చేయని రోల్ లేదు. వైవిధ్యమైన కేరక్టర్లను రాసుకున్నవారికి ఫస్ట్ ఆప్షన్‌గా మారుతున్నారు మిస్టర్ సేతుపతి. కన్నడ సీఎం సిద్ధరామయ్య బయోపిక్‌లో విజయ్ సేతుపతి నటిస్తారనే వార్త స్పీడ్‌గా వైరల్ అవుతోంది. సిద్ధరామయ్య బయోపిక్ టాక్స్ లో ఉన్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో పాటు విజయ్ సేతుపతి పేరు కూడా వైరల్ అవుతోంది. రెండు పార్టులుగా ఈ బయోపిక్‌ని తెరకెక్కించనున్నారు. లీడర్ రామయ్య అనే పేరుతో తెరకెక్కించనున్నారు. ఎ కింగ్ రెయిజ్డ్ బై పీపుల్ అనేది ట్యాగ్ లైన్‌గా మారనుంది. సత్యరత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనున్నారు. పూజా కార్యక్రమాలు పూర్తి కాగానే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేలా ప్లానింగ్ జరుగుతోంది.
విజయ్ సేతుపతి కాల్షీట్ ఇచ్చేదాని ప్రకారం ఈ సినిమాను తెరకెక్కించాలని మేకర్స్ నిర్ణయించినట్టు టాక్. ఫస్టు పార్టులో చాలా వరకు విజయ్ సేతుపతికి సీన్లు ఉండవు. ఎక్కువగా సిద్ధరామయ్య బాల్యం, యవ్వనం మీద ఎక్కువ ఫోకస్ చేస్తారట. సెకండ్ పార్టులో విజయ్ సేతుపతి సీఎంగా కనిపిస్తారట. ఈ సినిమాతో పాటు విడుదలై సెకండ్ పార్టులోనూ నటిస్తున్నారు విజయ్ సేతుపతి. మరో వైపు జవాన్‌లో విలన్‌గా నటిస్తున్నారు. వచ్చే నెల విడుదల కానుంది జవాన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



