'ఉప్పెన'లో విజయ్ సేతుపతి లుక్ ఇదే!
on Feb 10, 2020
వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న 'ఉప్పెన' చిత్రంలో పాపులర్ తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. చిత్రంలో ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోమవారం విడుదల చేశారు. అంబాసడర్ కారుకు ఆనుకొని నిల్చొని, మెలి తిప్పిన మీసాలతో, తీక్షణమైన చూపులతో విజయ్ సేతుపతి కనిపిస్తున్నారు. పోస్టర్ ప్రకారం ఆయన నడివయసు వ్యక్తిలా ఉన్నారు. బ్యాగ్రౌండ్ లో సముద్రం కనిపిస్తోంది.
మరో పోస్టర్లో సిగరెట్ తాగుతూ దీర్ఘాలోచనలో ఉన్న విజయ్ సేతుపతి కనిపిస్తున్నారు. లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన బుచ్చిబాబు సానా.. 'ఉప్పెన'తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ద్వారా కృతి శెట్టి నాయికగా టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. 'రాక్ స్టార్' దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ 'ఉప్పెన'ను నిర్మిస్తోంది. సాయిచంద్, బ్రహ్మాజీ మరో రెండు కీలక పాత్రలు చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
