‘లియో’ కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి!
on Mar 24, 2023
దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా లియో. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ని కశ్మీర్‌లో తెరకెక్కించారు డైరక్టర్ లోకేష్ కనగరాజ్. మైనస్ ఐదు డిగ్రీల చలిలో షూటింగ్ చేశారు. ఈ విషయాలన్నీ లియో టీమ్ విడుదల చేసిన స్పెషల్ వీడియో ద్వారా తెలిశాయి. దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లియో మీద ఇప్పుడు అందరి కళ్లూ ఉన్నాయి. దాదాపు నెల రోజుల పాటు కశ్మీర్‌లో ఫస్ట్ షెడ్యూల్ తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో పనిచేసిన క్రూ కి ట్రిబ్యూట్ ఇచ్చేలా వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. దాదాపు 5-6 డిగ్రీల చలిలో యూనిట్ పనిచేయడాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు ఆ వీడియోలో. మంచు కొండల్లో వాళ్లు ఎలా షూటింగ్ చేశారో వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎలా వంట చేసుకున్నారు? ఎలా భోజనం చేశారు? షూటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు వంటి విషయాలన్నీ అందులో కనిపిస్తాయి.
కశ్మీర్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా తలచుకున్నారు డైరక్టర్ లోకేష్ కనగరాజ్. ``నా నటీనటులు, సాంకేతిక నిపుణుల పట్ల కృతజ్ఞతతో, గౌరవంతో రాస్తున్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, వాతావరణం ఎలా ఉన్నా, జనాలకు వినోదం పంచాలనే ఒకే ఒక ధ్యేయంతో పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికీ దీన్ని అంకితం చేస్తున్నాను`` అని రాశారు. దాంతో పాటు ది క్రూ బిహైండ్ లియో, కశ్మీర్ షెడ్యూల్ ర్యాప్ అని కూడా హ్యాష్ ట్యాగ్స్ జత చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కశ్మీర్‌లో భూకంపం కూడా వచ్చింది. ఆ సమయంలోనే తాము సేఫ్‌గా ఉన్నట్టు ఈ టీమ్ ట్విట్టర్ పేజ్‌లో రాసుకొచ్చింది. మాస్టర్ తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో సినిమా ఇది. విజయ్, త్రిష కృష్ణన్, మిస్కిన్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవమీనన్‌తో పాటు పలువురు కీ రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు 10-15 రోజులు షెడ్యూల్ బ్రేక్ తీసుకుంటుంది యూనిట్. మిగిలిన భాగమంతా చెన్నైలోనూ, హైదరాబాద్‌లోనూ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ రెండో వారంలో సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
