రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘రణబాలి’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విజయ్ మాట్లాడిన మాటలు, చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ యాసలో బ్రిటీషర్లపై విజయ్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
బ్రిటీషర్ల పాలన, అప్పటి అణచివేత గురించి మాట్లాడుతూ విజయ్.. ఆ రోజుల్లో మనవాళ్లు తిరగబడి ఉంటే తెల్లదొరలను అప్పుడే తరిమేసేవాళ్లమని చెప్పాడు. ఈ సందర్భంగా సినిమాలో తాను చెప్పిన డైలాగ్‌ను కూడా స్టేజ్‌పై చెప్పాడు. “సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్క.. ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’ అంటూ విజయ్ గర్జించడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాయలసీమ యాసలో విజయ్ చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ‘రణబాలి’ గురించి విజయ్ మాట్లాడుతూ.. మన చరిత్రలో నిజమైన విప్లవ వీరుల పేర్లు చాలావరకు మరుగున పడిపోయాయని చెప్పాడు. బుర్రకథలు, జానపద కథల్లో మాత్రమే మిగిలిపోయిన అలాంటి యోధుల గురించి ప్రపంచానికి చెప్పే ప్రయత్నమే ఈ సినిమా అని వివరించాడు. అప్పటి తీవ్ర కరువు పరిస్థితులు, సింగనమల ప్రాంత పోరాటం, మన పూర్వీకుల త్యాగాలను సినిమాలో చూపించినట్టు తెలిపాడు. ఈ కథ తెలుగు సినిమా చరిత్రలోనే అత్యుత్తమ స్క్రిప్ట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేశాడు.
హీరోయిన్ రష్మిక మందన్న షూటింగ్ కారణంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరు కాలేకపోయింది. దీంతో విజయ్ స్టేజ్‌పైనే ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాడు. తన కెరీర్‌తో పాటు రష్మిక ఫిల్మోగ్రఫీలో కూడా ‘రణబాలి’ ప్రత్యేకంగా నిలిచిపోతుందని విజయ్ చెప్పాడు. రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[Vijay Deverakonda, Ranabaali, Ranabaali Movie, Vijay Deverakonda Ranabaali, Ranabaali Dialogue, Vijay Deverakonda Dialogue, Ranabaali Trailer, Vijay Deverakonda Rayalaseema Dialogue, Ranabaali Viral Dialogue, Singanamala Bobbili Ranabaali, Rashmika Mandanna, Rahul Sankrityan, Ranabaali Trailer Launch, Vijay Deverakonda Latest News, Ranabaali Movie Update, Telugu Cinema, Tollywood, Vijay Deverakonda New Movie]




