
విజయ్ దేవరకొండ మోస్ట్ అవైటెడ్ మూవీ 'రణబాలి' వాయిదా పడిందంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దసరా రేసు నుంచి తప్పుకొని, డిసెంబర్‌కి పోస్ట్‌పోన్ అయిపోయిందంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ చిత్ర యూనిట్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.
'రణబాలి' సినిమాను అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. విజయ్ కి 'టాక్సీవాలా' వంటి సూపర్ హిట్ అందించిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పిరియాడిక్ యాక్షన్ మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. 19వ శతాబ్దం నాటి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగే ఒక పవర్‌ఫుల్ అండ్ రా యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
అయితే, ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉందని, విజువల్ ఎఫెక్ట్స్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, అంతే కాకుండా బాక్సాఫీస్ రేసులో ఇతర పెద్ద సినిమాలు ఉండటంతో డిసెంబర్ 3కి రణబాలిని షిఫ్ట్ చేస్తున్నారంటూ ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే వాయిదా వార్తలన్నీ ఫేక్ అని తాజాగా మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. షూటింగ్ పూర్తయిందని, అక్టోబర్ 16న సినిమా విడుదలవుతుందని స్పష్టం చేసింది. దీంతో దసరాకు బాక్సాఫీస్ దగ్గర రణబాలి విశ్వరూపం చూడటం ఖాయమైంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలసి నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక ప్రతినాయక పాత్ర పోషిస్తుండగా, అజయ్ - అతుల్ అందిస్తున్న మ్యూజిక్ సినిమాకి మెయిన్ హైలైట్ కానుంది. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ పూర్తవ్వడంతో, మిగిలిన సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్వాలిటీగా పూర్తి చేయడానికి మేకర్స్ కేటాయిస్తున్నారు.
[Ranabaali Release Date, Ranabaali Dasara Release, Ranabaali Shoot Wrap, Ranabaali Movie, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Telugu Film News, Telugu News]






