
‘దసరా’ వంటి మాసివ్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఒడెల కాంబినేషన్‌లో వస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. రిలీజ్‌కి ముందే ఈ సినిమా సృష్టిస్తున్న బిజినెస్ సునామీ చూస్తుంటే ట్రేడ్ వర్గాలే షాక్ అయిపోతున్నాయి.
నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ కలిపి ఏకంగా రూ. 103 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు సమాచారం. టాలీవుడ్ టాప్ స్టార్స్ కాకుండా, ఒక టైర్-2 స్టార్ సినిమా వంద కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయడం ఇదే తొలిసారి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ నెక్స్ట్ లెవల్‌లో జరిగింది. నైజాం ఏరియా రైట్స్ ఏకంగా రూ. 35 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఆంధ్రాలో రూ.30.7 కోట్లు, సీడెడ్‌లో రూ.10 కోట్లు బిజినెస్ చేసింది. అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ‘ది ప్యారడైజ్’ బిజినెస్ ఏకంగా రూ.75.7 కోట్లు చేసింది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లో కూడా నాని మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 18 కోట్ల రికార్డు ధరకు క్లోజ్ అయినట్లు సమాచారం. ఇక రెస్టాఫ్ ఇండియాలో మరో రూ.10 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ‘ప్యారడైజ్’ మూవీ రూ.103.7 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్‌గా నిలవాలంటే దాదాపు రూ. 105 కోట్ల షేర్ సాధించాల్సి ఉంటుంది. గ్రాస్ పరంగా చూస్తే, రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. ఈ టార్గెట్ ను నాని రీచ్ అయితే.. ఆయన టైర్-1 స్టార్ గా అవతరించినట్టే.
[The Paradise Theatrical Business, The Paradise Pre Release Business, The Paradise Business, Paradise 100 Crore Business, Nani Paradise Movie, Natural Star Nani, Srikanth Odela, Telugu Film News, Telugu News]





