
భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత శక్తివంతమైన సెన్సార్ బోర్డును కేంద్ర ప్రభుత్వం ఒకే ఒక్క నిర్ణయంతో సమూలంగా ప్రక్షాళన చేసేసింది. ఏకంగా 9 ఏళ్ల తర్వాత బోర్డును పూర్తిగా రీకన్స్ట్రక్ట్ చేస్తూ నూతన సభ్యులను ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన నిర్ణయం ప్రకారం.. 2017 తర్వాత, అంటే దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం సెన్సార్ బోర్డును ఫుల్ లెంగ్త్‌లో పునర్వ్యవస్థీకరించారు. ప్రసార భారతి మాజీ సీఈవో శశి శేఖర్ వెంపటి నేతృత్వంలో విభిన్న రంగాలకు చెందిన 18 మంది ప్రముఖులతో కూడిన నూతన పాలకమండలిని కేంద్రం అధికారికంగా నియమించింది. ఈ కొత్త కమిటీ రాబోయే మూడేళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగనుంది.
బాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా, విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠి, సీనియర్ యాక్టర్ సునీల్ శెట్టి, బెంగాలీ సూపర్ స్టార్ ప్రసేన్‌జిత్ ఛటర్జీలతో పాటు లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్‌లకు ఈ నూతన బోర్డులో మెంబర్షిప్ లభించింది. ఇక టీవీ అండ్ మ్యూజిక్ ఇండస్ట్రీల నుంచి ఐకానిక్ యాక్టర్ రూపాలీ గంగూలీ, మూడుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రికీ కేజ్, సూఫీ గాయకుడు హన్స్ రాజ్ హన్స్, మనోజ్ జోషిలకు చోటు కల్పించారు.

ఈ ప్రతిష్టాత్మక సెన్సార్ బోర్డులో తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధిగా ప్రముఖ నిర్మాత, అన్నపూర్ణా స్టూడియోస్ బిజినెస్ హెడ్ సుప్రియ యార్లగడ్డకి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. నాగార్జున మేనకోడలు, అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన సుప్రియ ఫిల్మ్ ప్రొడక్షన్, ఎగ్జిబిషన్, సినీ బిజినెస్ పై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఆమె ఈ నూతన మండలిలో సభ్యురాలిగా నియామకం కావడంపై టాలీవుడ్‌లో హర్షం వ్యక్తమవుతోంది.
ఇటీవలి కాలంలో సినిమాల సెన్సార్ వివాదాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. టైటిల్స్ మార్పు, A సర్టిఫికెట్స్ ఇవ్వడం వంటి విషయాల్లో మేకర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో సీనియర్ నటీనటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఉన్న ఈ నూతన CBFC టీమ్ రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోబోతోందో చూడాలి. సినీ ప్రపంచంలో క్రియేటివ్ ఫ్రీడమ్‌ని కాపాడుతూనే, ప్రేక్షకుల భావోద్వేగాలకు తగినట్టుగా ఈ కొత్త బోర్డు ఎలా వ్యవహరించనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.
[CBFC New Board, Central Board of Film Certification, Supriya Yarlagadda CBFC, Indian Cinema Censor Board, Preity Zinta CBFC, Pankaj Tripathi CBFC, Telugu Film News, Telugu News]





