సెల్ఫ్ క్వారంటైన్: తమ్ముడితో చెస్ ఆడుతున్న రౌడీ హీరో!
on Mar 22, 2020

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఆదివారం జనతా కర్ఫ్యూకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సాధారణ ప్రజానీకంతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో తామేం చేస్తున్నారో కొంతమంది షేర్ చేసుకుంటున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ జనతా కర్ఫ్యూ కంటే ముందుగానే స్వీయ క్వారంటైన్‌ను ఎలా గడుపుతున్నాడో ఫొటోల ద్వారా షేర్ చేసుకున్నాడు. తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి చెస్ ఆడుతూ టైమ్ గడుపుతున్న ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అన్నదమ్ములిద్దరూ చాలా సీరియస్‌గా చెస్ ఆడుతూ ఆ ఫొటోల్లో కనిపిస్తున్నారు. స్లీవ్‌లెస్ ఆరెంజ్ టీ-షర్ట్ వేసుకున్న విజయ్ తెల్ల పావులతో, గ్రే కలర్ టీ-షర్ట్ ధరించిన ఆనంద్ నల్ల పావులతో ఆడుతున్నారు.
"చెస్ ఆడుతూ టైమ్ గడుపుతున్నాం. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంట్లో గడపండి, సురక్షితంగా ఉండండి. తాము బలంగా, ఆరోగ్యంగా ఉంటామని కుర్రాళ్లు అనుకుంటూ ఉంటారు. గుర్తుంచుకోండి.. మీరు అసాధ్యులేమీ కాదు! కాబట్టి దయతో ఇతరుల గురించి ఆలోచించండి, మన దేశం గురించి ఆలోచించండి" అని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు ఆనంద్ దేవరకొండ. అతను భవ్య క్రియేషన్స్ నిర్మిస్తోన్న చిత్రంలో నటిస్తుండగా, విజయ్ దేవరకొండ 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీని పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో చేస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



