సంక్రాంతి తరువాత సెట్స్ పైకి ఫైటర్?
on Dec 4, 2020
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఫైటర్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో విజయ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. కరణ్ జోహార్ సమర్పణలో పూరీ, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో.. కరోనా ఎఫెక్ట్ తో చిత్రీకరణకి బ్రేక్ పడింది. అయితే పలు సినిమాలు మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళగా.. ఫైటర్ మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. తాజా సమాచారం ప్రకారం.. సంక్రాంతి తరువాత ఫైటర్ షూటింగ్ జరుపుకునే అవకాశముందని టాక్. ఫారిన్ ఫైటర్స్ కాంబినేషన్ లో రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారని.. ఈ ఘట్టాలను రాజీ లేకుండా చిత్రీకరించాలనే ఉద్దేశంతో పూరీ జగన్నాథ్ ఉన్నారని.. అందుకే కరోనా ప్రభావం బాగా తగ్గాకే చిత్రీకరణని పునః ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారని వినికిడి.
సో.. లేట్ అయినా లేటెస్ట్ హంగులతో ఫైటర్ అలరించబోతున్నాడన్నమాట.