బడా తమిళ్ నిర్మాత చేతిలో పడ్డ అర్జున్ రెడ్డి...
on Dec 23, 2017
అర్జున్ రెడ్డి ఘన విజయంతో హీరో విజయ్ దేవరకొండ ఫేట్ మారిపోయింది. అగ్ర నిర్మాణ సంస్థలు విజయ్ కోసం క్యూ కడుతున్నాయి అంటే, అతగాడికి ఉన్న డిమాండ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం, గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ లో ఒక సినిమా చేస్తున్న విజయ్, యువీ క్రియేషన్స్ బ్యానర్ లో కూడా ఒక సినిమా సైన్ చేసాడు. ఇవి కాకుండా ఇంకొన్ని సినిమాలు లైనప్ లో ఉన్నాయి. తెలుగులో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న విజయ్ దేవరకొండకి కోలీవుడ్ లో కూడా తలుపులు తెరుచుకున్నాయి.
ఆసక్తికర విశేషం ఏంటంటే, తమిళ్ బడా నిర్మాత మరియు స్టూడియో గ్రీన్ అధినేత అయిన కే.ఈ. జ్ఞానవేల్ రాజా విజయ్ దేవరకొండతో ఒక బైలింగ్వల్ సినిమా చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ సినిమాకి అరిమ నంబి, ఇరు ముగన్ లాంటి సినిమాలు తీసిన ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించనున్నాడు. కథ నచ్చడంతో పాటు, బడా నిర్మాణ సంస్థ నుండి ఆఫర్ రావడంతో తమిళ్లో ఎంట్రీ ఇచ్చేందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఎందరో తమిళ్ హీరోలు తెలుగులో తమ ప్రభావం చూపించారు. కానీ, తెలుగు హీరోలకి తమిళ్లో ఆదరణ కాస్త తక్కువనే చెప్పొచ్చు. మరి విజయ్ దేవరకొండ కోలీవుడ్ లో ఏ మేరకు నెగ్గుకురాగలడో చూడాలి...