విజయ్ దేవరకొండ మరో పాన్ ఇండియా ప్రయత్నం!
on Jul 26, 2023

అభిమానులు ఎంతో ప్రేమగా రౌడీ స్టార్ అని పిలుచుకునే విజయ్ దేవరకొండ.. `లైగర్` సినిమాతో పాన్ ఇండియా ప్రయత్నం చేశారు. పూరీ జగన్నాథ్‌పై నమ్మకంతో చేసిన ఈ ప్రయత్నం విజయ్‌కి ఊహించని ఫలితాన్ని ఇచ్చింది. సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ వ్యవహారంపై తనెంత కష్టపడాలో అంత పడ్డానని, కానీ ఫలితంపై నేనేం చేయలేనని ఈ స్టార్ చెప్పేశారు. ఇప్పుడు తన తదుపరి చిత్రాలపై ఫోకస్ చేశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్.
వివరాల్లోకి వెళితే.. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ `జటాయువు` పేరుతో ఓ భారీ చిత్రానికి సంబంధించిన కథను సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయటానికి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సిద్ధమయ్యారు. అయితే ఇందులో ఎవరిని హీరోగా తీసుకోవాలని దిల్ రాజు చాలా ఆలోచించారు. చివరకు ఈ సినిమాలో విజయ్ దేవరకొండనే హీరోగా అప్రోచ్ అయితే తను కూడా ఓకే చెప్పినట్లు టాక్. భారీ సెట్స్, విజువల్స్ బేస్డ్ మూవీగా `జటాయువు` మూవీ తెరకెక్కనుంది. దీన్ని దిల్ రాజు పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పుడు విజయ్ దేవరకొండ చేస్తోన్ని సినిమాల విషయానికి వస్తే శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా విజయ్ కనిపించబోతున్నారు. పరశురామ్ డైరెక్షన్‌లో మరో సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



