రవితేజపై విజయ్‌దే పైచేయి!
on Nov 21, 2018

నవంబర్ మూడోవారంలో స్ట్రయిట్ తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. నవంబర్ 16న విడుదలైన రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' డిజాస్టర్ కాగా... ఒక్క రోజు తరవాత నవంబర్ 17న వచ్చిన విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' విజయపథంలో దూసుకువెళుతోంది. నిజానికి, 'టాక్సీవాలా' సినిమా కూడా నవంబర్ 16న విడుదల కావాల్సింది. అయితే... రవితేజ సినిమా విడుదల వుండటంతో ఒక్క రోజు వెనక్కి వెళ్ళింది. అదేమీ 'అమర్ అక్బర్ ఆంటోనీ'కి కలసి రాలేదు. దర్శకుడు శ్రీనువైట్ల ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకొని విధంగా సినిమా తీయడంతో కనీస స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. మార్నింగ్ షో తరవాత మౌత్ టాక్ ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. సినిమా బాగోలేదని బలంగా వినిపించడంతో వసూళ్లు డ్రాప్ అయ్యాయి. రవితేజ లాస్ట్ సినిమా ప్లాప్ కావడమూ 'అమర్ అక్బర్ ఆంటోనీ'పై ప్రభావం చూపింది. విజయ్ దేవరకొండ లాస్ట్ సినిమా 'నోటా' కూడా ప్లాపే. కానీ, 'టాక్సీవాలా'పై పడలేదు. ప్రేక్షకులు సినిమాకు వచ్చారు. సినిమా హిట్టని తెలడంతో వసూళ్లూ బావున్నాయి. ఇటు వసూళ్ల పరంగా, అటు క్రేజ్ పరంగా రవితేజపై విజయ్ దేవరకొండ పైచేయి సాధించినట్టు అయ్యింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



