Home

»

Latest News

చెప్పులు వేసుకోవడం మానేసిన విజయ్ ఆంటోని.. కారణం చెబుతూ భార్య ఫాతిమా ఎమోషనల్!

Nov 19, 2026 4:01PM

 

బిచ్చగాడుతో పాటు పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించాడు విజయ్ ఆంథోనీ.. రీసెంట్ గా ఆయన వైఫ్ ప్రముఖ ప్రొడ్యూసర్  ఫాతిమా తొలిసారిగా ఒక బహిరంగ సినిమా కార్యక్రమంలో పాల్గొని తమ కుటుంబంలోని ఎన్నో హృదయాన్ని కదిలించే విషయాలని పంచుకున్నారు. 


సాధారణంగా సెలబ్రిటీలు లక్షల రూపాయల విలువైన ఖరీదైన బ్రాండెడ్ వాచ్‌లను ధరిస్తుంటారు. కానీ విజయ్ ఆంటోనీ మాత్రం తన వద్ద ఉన్న విలాసవంతమైన స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఖరీదైన గడియారాలను పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఆయన చేతికి కేవలం రూ. 3,900 విలువ చేసే ఒక సాధారణ వాచ్ మాత్రమే ఉంటోంది. మీరాను చివరిసారిగా చూసినప్పుడు ఆమె మణికట్టుపై ఉన్న వాచ్ అదేనని ఫాతిమా వెల్లడించారు.

ఆ వాచ్‌ను మొదటిసారి కట్టుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు విజయ్ ఆంటోనీ ఎప్పుడూ తీయలేదని, "ఇది నా మీరా వాచ్, నా ఆరోగ్యాన్ని ఇకపై ఆమే దగ్గరుండి చూసుకుంటుంది" అని ఆయన ఎంతో ఆవేదనతో చెప్పిన మాటలను ఫాతిమా గుర్తుచేసుకున్నారు. ఒక తండ్రికి తన కూతురిపై ఉన్న అంతులేని ప్రేమకు ఈ ఒక్క విషయం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. 


మీరా జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న మరో హృదయ విదారక నిర్ణయాన్ని కూడా ఫాతిమా బయటపెట్టారు. గతంలో మీరా కోసం కొనుగోలు చేసిన చెప్పులు, షూలతో ఇంట్లోని ఒక గది మొత్తం నిండిపోయి ఉండేదట. ఆ జ్ఞాపకాలని చూసిన తర్వాతే విజయ్ ఆంటోనీ కాళ్ళకి చెప్పులు వేసుకోవడమే మానేశారు. ఇప్పుడు కేవలం కొన్ని ప్రత్యేకమైన అధికారిక కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు మాత్రమే  షూ ధరిస్తున్నారని ఆమె తెలిపారు.

ఇది కూడా చదవండి: బాబు మీరు సినిమా హీరో: మర్చిపోయావా..గుర్తు చేశాను చూడు!

అలాగే మీరా ఎప్పుడూ ఒకే ఒక కమ్మ పెట్టుకునేదని, ఆమెను చివరిసారిగా సాగనంపేటప్పుడు ఆ కమ్మను తీసి పంపానని ఫాతిమా భావోద్వేగంతో చెప్పారు. మీరా ఉపయోగించిన గదిని ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలతో అలాగే ఉంచామని, త్వరలోనే ఆమె కోరుకున్న విధంగా ఆ గదిని తమ గదిగా మార్చుకోబోతున్నామని ఆమె వివరించారు.

 

బయటకు ఎంతో గంభీరంగా, మౌనంగా కనిపించే విజయ్ ఆంటోనీ ఇంట్లో మాత్రం ఎంతో సరదాగా, అల్లరిగా ఉంటారని ఫాతిమా చెప్పారు. ఆయన చేసే అల్లరి వల్ల ఇంట్లో సెల్‌ఫోన్లు, టీవీలు పగిలిపోతుంటాయని నవ్వుతూనే, కొత్తవి కొనాలంటే చేతిలో డబ్బులు లేవని, ఈ సినిమా బాగా ఆడితేనే వాటిని కొనుక్కోవాలని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ కష్టకాలంలో తనను, తమ చిన్న కూతురు లారాను విజయ్ ఆంటోనీ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని ఆమె కృతజ్ఞత తెలిపారు. 

 

మీకు నచ్చవచ్చు:ఆదర్శ కుటుంబంపై రంగస్థలం భామ పూజిత పొన్నాడ షాకింగ్ కామెంట్స్!
మీకు నచ్చవచ్చు :విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్: ప్లాప్ మూవీకి సక్సెస్ మీట్!

 

 

[Vijay Antony, Meera, Fatima Vijay Antony, Kollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com