Home

»

Latest News

రాధికా ఆప్టే వివాదంపై కీర్తి సురేష్ క్లారిటీ.. అప్పుడెందుకు నవ్వానంటే.?

Nov 19, 2026 4:17PM

టాలీవుడ్‌ గురించి బాలీవుడ్‌ యాక్టర్స్ చేసే కొన్ని కామెంట్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంటాయి. తాజాగా నటి రాధికా ఆప్టే చేసిన కామెంట్స్ కూడా అలాంటి వివాదాన్నే రాజేశాయి. ఓ తెలుగు సినిమాలో తన పాత్ర మేనమామను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని, ఆ అనుభవం తనకు నచ్చలేదని రాధికా ఆప్టే చెప్పడం చర్చనీయాంశమైంది. అయితే ఆ సమయంలో ఆమె పక్కనే ఉన్న కీర్తి సురేష్ నవ్వుతూ స్పందించడం కూడా విమర్శలకు కారణమైంది. తాజాగా ఈ వ్యవహారంపై కీర్తి స్పందించారు.

తన వెబ్ సిరీస్ ‘అక్క’ ప్రమోషన్లలో భాగంగా రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలో నటించిన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాలో తన పాత్ర మేనమామను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని, తనకంటే ఎక్కువ వయసున్న నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. అంతేకాదు, సినిమాలో తన పాత్ర మధ్యలోనే చనిపోవడం కూడా తనకు నచ్చలేదని వ్యాఖ్యానించారు.

రాధికా ఆప్టే ఏ సినిమా పేరు చెప్పకపోయినా.. ఆమె వ్యాఖ్యలు బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమాను ఉద్దేశించేనని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆ సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించారు. ఆమె కామెంట్స్ పై తెలుగు ఆడియన్స్ ఫైర్ అయ్యారు. 

ఆ ఇంటర్వ్యూలో రాధిక పక్కనే కూర్చున్న కీర్తి సురేష్ నవ్వుతూ.. ‘మేనమామను పెళ్లి చేసుకోవడం తమిళ, తెలుగు సంప్రదాయాల్లో ఒకటి’ అనే అర్థం వచ్చేలా స్పందించారు. దీంతో కొందరు ప్రేక్షకులు కీర్తి తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ప్రమోషన్స్‌ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్‌ రావిపూడిపై కీర్తి, కృతి సెటైర్లు.!

తాజాగా తన కొత్త సినిమా ‘సత్యవాన్ సావిత్రి’ ప్రమోషన్ల సందర్భంగా ఈ వివాదంపై కీర్తి సురేష్‌కు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. రాధికా ఆప్టే మొదట ఏమి చెబుతున్నారో తనకు అర్థం కాలేదని వివరించారు. ఆమె ‘మామ’ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పినప్పుడు ఆ మాటల వెనుక ఉన్న సందర్భం తనకు వెంటనే అర్థం కాలేదని తెలిపారు.

ఆ తర్వాత రాధిక సౌత్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న సంప్రదాయం గురించి మాట్లాడుతున్నారని అర్థం చేసుకున్నానని చెప్పారు. ఆ సంప్రదాయం గురించి తెలియని వ్యక్తికి వివరించే ప్రయత్నమే తాను చేశానని కీర్తి స్పష్టం చేశారు.

‘నేను మన సంస్కృతిని ఎప్పటికీ తక్కువ చేసి మాట్లాడను. సౌత్ లో ఈ సంప్రదాయం ఉందని చెప్పాను. నార్త్ వాళ్ళకి మన సంప్రదాయాల గురించి తెలియపోవచ్చు’ అని కీర్తి వివరించారు.

మీకు నచ్చవచ్చు:
బాలకృష్ణ 'దాదా' లేటెస్ట్ అప్డేట్.. సినిమాలో అదిరిపోయే ట్విస్ట్.!
క్యూట్ వీడియో.. గాయత్రీ మంత్రం చదివిన ప్రియాంక చోప్రా కూతురు.!

 

 

 

[Radhika Apte Controversy, Keerthy Suresh Clarification, Nandamuri Balakrishna, Legend Movie]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com