పేరు ఉంది కదా అని రాజకీయాల్లోకి రాకూడదు.. విజయ్ గురించి తమిళ ప్రజలకి తెలిసేలా చేసావు
on Jun 25, 2025

'బిచ్చగాడు' మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో సమానమైన క్రేజ్ ని సంపాదించుకున్న నటుడు 'విజయ్ ఆంథోనీ'(Vijay Antony). ప్రస్తుతం 'మార్గన్'(Maargan)అనే మూవీ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'మార్గన్' ఈ నెల 27 న రిలీజ్ కానుంది. లియో జాన్ పాల్(Leo John Paul)దర్శకత్వం వహించగా 'మీరా విజయ్ ఆంథోనీ' నిర్మాణ సారధ్యంలో తెరకెక్కింది. అజయ్ దిషాన్, సముద్రఖని, ప్రీతిక ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.
ఇక రిలీజ్ ని పురస్కరించుకొని విజయ్ అంథోని పలు రకాల ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రాజకీయాలపై మాట్లాడుతు 'నటీనటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలన్నా రూల్ లేదు కదా! నాకైతే రాజకీయాల్లోకి అడుగుపెట్టాలన్న ఉద్దేశ్యం లేదు. ఫేమ్ ఉంది కదా అని రాజకీయాల్లోకి రాకూడదు. సేవ చెయ్యాలనే ఉదేశ్యంతో ఎవరైనా ఎంట్రీ ఇచ్చినా, వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు ఉండాలి. అలా ఉన్నప్పుడే అధికారంలోకి రాగలరు. నిజం చెప్పాలంటే రాజకీయాలపై నాకు అవగాహనా లేదు. ఎవరైనా ముందు ప్రజల సమస్యలని అర్ధం చేసుకోవాలని చెప్పుకొచ్చాడు.
2012 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నాన్' తో క్రేజ్ ని సంపాదించుకున్న విజయ్ ఆంథోనీ ఇప్పటి వరకు సుమారు ఇరవై చిత్రాల వరకు చేసాడు. హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా,ఎడిటర్ గా , పాటల రచయితగా , ఆడియో ఇంజనీర్ గా బహు ముఖ పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. మరో నాలుగు కొత్త చిత్రాలకి కూడా విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



