కత్రినా ఇంటి దగ్గర ప్రత్యక్షమైన స్టార్ హీరో!
on Aug 9, 2020

ఒక యాక్టర్ జీవితంలో లింకప్స్ అనేవి విడదీయలేని భాగం. వాటిని వాళ్లు పట్టించుకోకపోవచ్చు, తిరస్కరించవచ్చు. కానీ వాటికి దూరంగా మాత్రం పారిపోలేరు. ఒక్కసారి గ్లామర్ వరల్డ్‌లోకి అడుగుపెట్టాక అందరి కళ్లూ వాళ్లను గమనిస్తుంటాయి, ఎవరు ఎవరితో కనిపించినా లింకులు కలిపేసి ప్రచారం చేసేస్తుంటారు. చాలా మంది విషయంలో ఈ లింకప్స్ అనేవి అబద్ధంగా తేలితే, కొంతమంది విషయంలో నిజమని నిరూపితమయ్యాయి. కొంత కాలంగా అలాంటి లింకప్ రూమర్‌ను కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఎదుర్కొంటున్నారు.
తన పర్సనల్ లైఫ్‌ను కత్రినా ఎంత ప్రైవేట్‌గా ఉంచుదామని అనుకుంటున్నా మీడియా కళ్లు మాత్రం ఆమె అనుబంధాలపై ఆసక్తి చూపుతూనే వస్తోంది. 2019లో తాను సింగిల్ అని కన్‌ఫామ్ చేసిన బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ యాక్టర్ విక్కీ కౌశల్.. ఎట్టకేలకు తన లేడీలవ్‌ను కత్రినాలో కనిపెట్టాడని బాలీవుడ్ కోడై కూస్తోంది. ఆ ఇద్దరూ మాత్రం తమ మధ్య ఏమీ లేదని చెప్పుకుంటూ వస్తున్నారు.
అయితే కొవిడ్-19 వ్యాప్తి కారణంగా ముంబై మహానగరం లాక్‌డౌన్‌తో నిశ్శబ్దంగా ఉన్నవేళ ఆదివారం (ఆగస్ట్ 9) కత్రినా నివాసం దగ్గర ప్రత్యక్షమయ్యాడు విక్కీ. తలకు క్యాప్, ముఖానికి మాస్క్, చేతులకు గ్లోవ్స్ ధరించి కారులోంచి హడావిడిగా కిందికి దిగి ఆమె ఇంట్లోకి వెళ్తుండగా కెమెరా కంటికి చిక్కాడు. దీంతో వాళ్ల మధ్య ఏదో జరుగుతోందనే ఊహాగానాలకు మరింత ఊతం లభించినట్లయింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



