Home

»

Latest News

సుమంత్ దిమ్మ తిరిగిపోయింది

Nov 8, 2016 10:47AM

 

రెండేళ్ల విరామం తీసుకొని విక్కీడోన‌ర్ రీమేక్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు సుమంత్‌. ఈ సినిమాపై పాపం.. చాలా కాన్ఫిడెన్స్ పెట్టుకొన్నాడు. ఎలాగైనా స‌రే... హిట్ట‌వ్వాల్సిందే అని క‌ష్ట‌ప‌డ్డాడు. అయితే ఫ‌లితం మ‌ళ్లీ రివ‌ర్స్ కొట్టింది. ఇది వ‌ర‌క‌టి కంటే భారీ డిజాస్ట‌ర్‌ని మూట‌గ‌ట్టుకోవాల్సివ‌చ్చింది. ఈ సినిమాకి కోటి రూపాయ‌ల లోపే పూర్తి చేసింది నిర్మాణ సంస్థ‌. కాబ‌ట్టి.. త‌క్కువ‌లో త‌ప్పించుకొనే ఛాన్స్ వ‌చ్చింది. తెలుగునాట వ‌సూళ్లు థియేట‌ర్ అద్దెల‌కే స‌రిపోని స్థాయిలో వ‌స్తున్నాయి. ఓవ‌ర్సీస్‌లో మ‌రీ ఘోరం. తొలి వారంతంలో ఆరువేల డాల‌ర్లు వ‌చ్చాయ‌ట‌. ఇది తెలుగు సినిమాల‌కెల్లా లీస్ట్ అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్రీమియ‌ర్ షోలు ఆఖ‌రి నిమిషంలో ర‌ద్దు కావ‌డం వ‌ల్ల రావ‌ల్సిన స్థాయిలో వ‌సూళ్లు రాలేదు. కొన్ని చోట్ల రిలీజ్ అయిన మొద‌టి రోజే జ‌నాలు లేక షోల‌ను కాన్సిల్ చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ట‌. అన్న‌పూర్ణ స్టూడియోస్‌, విక్కీ డోన‌ర్ రీమేక్‌.. దానిని తోడు భారీ ప్ర‌చారం ఇవేం.. సుమంత్‌ని కాపాడ‌లేక‌పోయాయి. ఫ్లాపులు త‌గ‌ల‌డంతో రెండేళ్లు క‌నిపించ‌కుండా పోయిన సుమంత్‌.... ఈసారి  ఎంత గ్యాప్ తీసుకొంటాడో మ‌రి!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com