Home

»

Latest News

ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ ప్లాన్ అదిరింది

Nov 8, 2016 10:52AM


ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం ఇటీవ‌లే ప‌ట్టాలెక్కిన‌సంగ‌తి తెలిసిందే. కాట‌మ‌రాయుడు షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే.. ఈ సినిమా షూటింగ్ మొద‌లెడ‌తారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ ఆగ‌స్టు 15 అని తేలింది. 2017 పంద్రాగ‌స్టుకి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తార‌ట‌. దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో సాగే సినిమా ఇద‌ని, అందుకే ఆ డేట్ ఫిక్స్ చేశార‌ని తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన బ‌రిలో దిగ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. త‌న పొలిటిక‌ల్ ఎంట్రీకి వెన్నుద‌న్నుగా నిలిచే క‌థ రాయ‌మ‌ని ప‌వ‌న్‌.. త్రివిక్ర‌మ్‌కి చెప్ప‌డం, ఈ మాట‌ల మాంత్రికుడు అనుకొన్న‌దే త‌డ‌వుగా క‌థ రెడీ చేయ‌డం జ‌రిగిపోయాయి. ఈ సినిమాకి 'దేవుడే దిగివ‌చ్చినా' అనే టైటిల్ పెట్టిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అయితే... టైటిల్ విష‌యంలో చిత్ర‌బృందం ఇంకా ఏ నిర్ణ‌యానికీ రాలేద‌ట‌. ఓ దేశ నాయ‌కుడి పేరే టైటిల్‌గా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. సో.. ఎన్నిక‌ల స‌మ‌యంలో దేశ‌భ‌క్తి అనే పాయింట్‌తో ఇటు ప్రేక్ష‌కుల్నీ, అటు ఓట‌ర్ల‌నీ ఆక‌ట్టుకొందామ‌న్న ప్లాన్ లో ఉన్నాడ‌న్న‌మాట‌. ఈ దోస్తుల ప్లానింగ్ అదిరిపోయింది క‌దూ.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com