Home

»

Latest News

టీజర్ రివ్యూ :  సింగం 3

Nov 8, 2016 10:04AM


సూర్య సినిమా అంటే దుమ్ము రేగిపోయే స్పీడు ఉండాల్సిందే. దానికి తోడు ద‌ర్శ‌కుడు హ‌రి స్టైల్ కూడా అదే. అందుకే సింగం 1, సింగం 2 మాస్‌కి విప‌రీతంగాన‌చ్చేశాయి.  ఆ సినిమాల్లో క‌థ ఎలాగున్నా... అందులోని స్క్రీన్ ప్లే స్పీడు చూసి మాస్ జ‌నాలు అవాక్క‌య్యారు. సీను కూడా ఫైటులానే తీర్చిదిద్ద‌డంలో హ‌రి సిద్ద‌హ‌స్తుడు. సూర్య బాడీ లాంగ్వేజ్‌కి అది బాగా సూట‌వ్వ‌డంతో.. సింగం సిరీస్‌లో వ‌చ్చిన తొలి రెండు సినిమాలూ సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే ఫార్ములాని ఉప‌యోగించి సింగం 3 తీశారు. సింగం 1.. ప‌ల్లెటూరు నేప‌థ్యంలో సాగే క‌థ‌. పార్ట్ 2లో సింగం ప‌ట్నం వ‌స్తాడు. ఇప్పుడు ఏకంగా విదేశాల్లోకే అడుగుపెట్టేశాడు. అందుకే సింగం 3 ట్రైల‌ర్లో ఎక్కువ ఫారెన్ లొకేష‌న్లే క‌నిపించాయి. సూర్య డైలాగులు, యాక్ష‌న్‌, ఆర్‌.ఆర్‌.. స్పీడు.. ఇవ‌న్నీ చూస్తుంటే సింగం గ‌త చిత్రాల‌కు ఇది ఏమాత్రం త‌గ్గ‌న‌ట్టే క‌నిపిస్తోంది. అయితే సూర్య న‌డిచింది త‌క్కువ‌... గాల్లో గెంత‌డం ఎక్కువ‌. డైలాగుల‌న్నీ అరుపులూ కేక‌లే. మాస్ వ‌ర‌కూ ఇలాంటి సినిమాలు ఓకే. క్లాస్‌ప‌రిస్థితేంటో అర్థం కావ‌డం లేదు. అనుష్క‌, శ్రుతిహాస‌న్‌లు క‌థానాయిక‌లు కావ‌డం వ‌ల్ల‌... ఈ సినిమాలో గ్లామ‌ర్‌కి లోటు లేక‌పోవొచ్చు. క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ ఏ రేంజులో ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com