
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఎంతవరకు పూర్తయిందో స్వయంగా చిరంజీవి వెల్లడించారు. దీంతో సంక్రాంతి రిలీజ్‌పై మరింత క్లారిటీ వచ్చేసింది.
సందీప్ కిషన్ నటిస్తున్న ‘సిగ్మా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘కాకా’ గురించి మాట్లాడుతూ.. ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తయిందని, సెకండాఫ్‌లో కూడా దాదాపు 30 శాతం షూటింగ్ కంప్లీట్ అయిందని తెలిపారు. అంటే మొత్తంగా చూస్తే సినిమా దాదాపు 70 శాతం వరకు పూర్తయినట్టే.
అంతేకాదు.. ‘కాకా’ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ హాఫ్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్‌ను కూడా థమన్ మొదలుపెట్టినట్లు చిరంజీవి తెలిపారు. ఒకవైపు షూటింగ్ జరుగుతూనే.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా నడుస్తుండటంతో టీమ్ సంక్రాంతి టార్గెట్‌పై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
ఇక ‘కాకా’ విషయంలో గత కొంతకాలంగా రిలీజ్ డేట్‌పై కూడా రకరకాల ప్రచారాలు వచ్చాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ మేకర్స్ ఇప్పటికే 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: వైరల్‌గా మారిన 'ఓర్రీ' వెడ్డింగ్ ఇన్విటేషన్.. పెళ్లికూతురు ఎవరు.?
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట కె. నారాయణ నిర్మిస్తున్నారు. చిరంజీవితో పాటు అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ ‘కాకా’పై క్యూరియాసిటీ పెంచేసింది. ఇందులో చిరంజీవి రెండు విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నారనే టాక్ వచ్చింది. అంతేకాదు.. తన పాత్ర పేరు 'కదిరి కాళిదాస్' అని కూడా చిరంజీవి స్వయంగా వెల్లడించారు.
మరోవైపు ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే ఆసక్తి ఉంది. ఇప్పుడు షూటింగ్ ఇప్పటికే 70 శాతం వరకు పూర్తవడం.. ఫస్ట్ హాఫ్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మొదలవడంతో సంక్రాంతి రేసులో ‘కాకా’ మరింత పక్కాగా కనిపిస్తోంది.
అన్నింటికంటే ముఖ్యంగా.. “ఈ సంక్రాంతి మనదే” అంటూ చిరంజీవి ఈవెంట్‌లో చెప్పడం మెగా ఫ్యాన్స్‌లో మరింత జోష్ పెంచింది. మరి బాబీ-చిరు కాంబినేషన్ ఈసారి సంక్రాంతి బరిలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
[Chiranjeevi Kaaka Update, Kaaka Shooting Update, Chiranjeevi Kaaka Movie, Kaaka Release Date, Megastar Chiranjeevi, Director Bobby Kolli, Chiranjeevi Sigma Event, Telugu Film News, Telugu News]






