Home

»

Latest News

Venkatesh: హీరోగా వెంకటేష్ కొడుకు అర్జున్ ఎంట్రీ ఎప్పుడు.. ఆ మిస్టేక్ చేయవద్దని ఫ్యాన్స్ విన్నపం!

Jul 1, 2026 3:56PM

 


తెలుగు చిత్రసీమలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ‘విక్టరీ’నే ఇంటిపేరుగా మార్చుకొని అభిమానులు, ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన అగ్ర హీరో వెంకటేష్‌(venkatesh)ఇప్పటికి  ఒంటి చేత్తో  200 కోట్ల రూపాయలని రాబడుతూ ఇది జస్ట్ శాంపిల్ ఇంకా చాలా ఉందని చాలా బలంగానే చాటి చెప్తున్నాడు. 100 శాతానికి పైగా డెడికేషన్, వివాద రహిత వ్యక్తిత్వంతో టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా నిలిచిన వెంకటేష్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన కుమారుడు అర్జున్ దగ్గుబాటి సిద్ధమవుతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. సురేశ్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, వెంకటేష్ ఎప్పుడూ తన పిల్లల చదువులకే తొలి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. గతంలో ఒక ప్రెస్ మీట్‌లో "అర్జున్(Arjun)ప్రస్తుతం బాగా చదువుకుంటున్నాడు, తనని డిస్టర్బ్ చేయకండి" అంటూ వెంకటేష్ చాలా సున్నితంగా విలేకరుల ప్రశ్నలను దాటవేసినప్పటికీ, ఇప్పుడు అర్జున్ వయస్సు 20 ఏళ్లకు చేరుకోవడంతో ఆయన సినీ ఎంట్రీపై టాలీవుడ్ సర్కిల్స్‌లో సరికొత్త చర్చ మొదలైంది.

టాలీవుడ్‌లో ఇప్పటికే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి దాదాపు 80 శాతానికి పైగా స్టార్ వారసులు ఇండస్ట్రీని ఏలుతుండగా, ఇప్పుడు దగ్గుబాటి మూడో తరం వారసుడిగా అర్జున్ ఎంట్రీ ఇవ్వనుండటం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, అర్జున్ తన డెబ్యూ కోసం విదేశాలలో ప్రత్యేకంగా నటన, ఫైట్స్, మరియు డ్యాన్స్‌లలో ప్రొఫెషనల్ శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. సురేశ్ బాబు, వెంకటేష్ ఇద్దరూ కలిసి ఈ వారసుడి లాంచింగ్ ప్రాజెక్ట్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి టాలీవుడ్ మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే అవకాశం ఉందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా 100% ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించేలా ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథను త్రివిక్రమ్ సిద్ధం చేశారని, అది వెంకటేష్‌కు కూడా ఎంతో నచ్చిందని ఫిలింనగర్ టాక్.


Also read: బాలకృష్ణ, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ ఇదేనా!

ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీలు కొత్తేమీ కాకపోయినా, కొందరు మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్‌లో చేరి సక్సెస్ సాధిస్తే, మరికొందరు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. అందుకే అర్జున్ డెబ్యూ విషయంలో దగ్గుబాటి కాంపౌండ్ ఎక్కడా రాజీ పడకుండా పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తోంది. గతంలో 2015లో విడుదలైన పవన్ కళ్యాణ్, వెంకటేష్ ల మల్టీస్టారర్ సినిమా ‘గోపాల గోపాల’లో అర్జున్ ఒక చిన్న క్యామియో రోల్‌లో మెరిసి, అప్పట్లోనే దాదాపు 10 సెకన్ల స్క్రీన్ ప్రెజెన్స్‌తో థియేటర్లలో ఈలలు వేయించారు. ఆనాటి బాల నటుడు ఇప్పుడు 6 అడుగుల కటౌట్‌తో వెండితెరపై పూర్తిస్థాయి హీరోగా సందడి చేయడానికి ముస్తాబవుతుండటం విశేషం. ఈ అద్భుతమైన క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. విక్టరీ వెంకటేష్ లాగే అర్జున్ కూడా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడా అనేది కాలమే నిర్ణయించాలి. అభిమానులు మాత్రం మరి ముఖ్యంగా కోరుకునేది అంటే అర్జున్ ఇరవై ఏళ్ళ వయసులోనే హీరోగా ఎంట్రీ ఇవ్వాలని. ఈ విషయంలో మరో ఆలోచన కూడా తావివ్వదని కోరుతున్నారు. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com