Home

»

Latest News

బాలకృష్ణ, ఎన్టీఆర్ మల్టీస్టారర్ ఇదేనా!

Jul 1, 2026 3:28PM


'నందమూరి'(Nandamuri)అనే నాలుగక్షరాల బ్రాండ్ కి ఉన్న కెపాసిటీ రోజు రోజుకి పెరగడమే తప్ప తగ్గదని నిరూపిస్తూ, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వారసులుగా బాక్స్ ఆఫీస్ ని చెడుగుడు ఆడుతున్నారు బాలకృష్ణ(Balakrishna),ఎన్టీఆర్(Ntr).. అభిమానులు  బాబాయ్, అబ్బాయ్ గా  పిలవబడే  ఈ ఇద్దరి  సినీ ప్రయాణం టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన అధ్యాయం. నటనకి సంబంధించి అన్ని రకాల క్యారక్టర్ లలోను    గర్జించే  సింహాలు. రీసెంట్ గా ఈ ఇద్దరి గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ అభిమానుల్లోను, సోషల్ మీడియాలోను జరుగుతుంది.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల 'గాడ్ ఆఫ్ వార్' స్టార్ట్ కాబోతున్నట్టు మొన్న ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. లార్డ్ సుబ్రమణ్య స్వామి (కుమారస్వామి) కథాంశం ఆధారంగా అత్యున్నత సాంకేతిక విలువల తో రూపుదిద్దుకోనుంది. "శివుని కుమారుడు.. పార్వతి గర్వకారణం.. శాశ్వత సైన్యాధిపతి.. మునుపెన్నడూ చూడని రీతిలో త్రివిక్రమ్‌తో మళ్లీ.." అంటూ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్ట్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించింది. విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఒక పవర్‌ఫుల్ త్రిశూలం, దానికి చుట్టుముట్టి ఉన్న డీఎన్‌ఏ ఆకారపు మేఘాలు, వెనుక రణరంగం కనిపించడం సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. "ఒక ఈటె, ఒక లక్ష్యం, ఒక దైవిక లెక్కింపు" అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా పూర్తిగా డివైన్ అండ్ మైథలాజికల్ వార్ నేపథ్యంలో సాగనుంది. 


Also read: Chiranjeevi: చిరంజీవి బయోపిక్.. ఈ హీరో మెప్పిస్తాడా!


ఈ మూవీలో శివుడి రోల్ కి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఆ శివుడి రోల్ ని బాలకృష్ణ పోషిస్తే అన్ని రకాలుగా బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. పైగా ఎప్పట్నుంచో మాలో ఉన్న బాలయ్య, ఎన్టీఆర్ ల మల్టి స్టారర్ కోరిక కూడా నెరవేరుతుందని కూడా అంటున్నారు. మరి అభిమానుల కోరికని ఎన్టీఆర్, బాలకృష్ణ, త్రివిక్రమ్ నెరవేరుస్తారేమో చూడాలి. ఒక్కటి మాత్రం నిజం. నందమూరి వంశం నుండి వచ్చిన ఈ ఇద్దరు హీరోలు తెలుగు సినిమా రారాజులుగా వెలుగుతున్నారు.బాక్సాఫీస్ వద్ద తన మాస్ పవర్‌తో గ్లోబల్ మార్కెట్‌ని కూడా శాసిస్తు టాలీవుడ్ ఉన్నంతవరకు నందమూరి సింహాల గర్జన  వినిపిస్తూనే ఉంటుందనే హింట్ ఇవ్వడంలో వెనుకాడటం లేదు. వీరిద్దరి సినీ ప్రయాణం రాబోయే తరాల నటులకి ఒక గొప్ప పాఠం. అలాంటి బాలయ్య, ఎన్టీఆర్ లు తండ్రి కొడుకులైన శివుడు, కుమార స్వామిగా చేస్తే సెల్యులాయిడ్ సైతం ఆనందంతో మురిసిపోతుంది.   

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com