ఫ్యామిలీ హీరోతో ఇదేం పని!
on Feb 20, 2023

విక్టరీ వెంకటేష్ అంటే తెలుగువారికి ఫ్యామిలీ హీరోగా గుర్తుండిపోతారు. ఫ్యామిలీ హీరోగా క్లీన్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోలలో వెంకటేష్ ఒకరు. ఆయనకు ఉన్న ఫ్యామిలీ హీరో ఇమేజ్ చాలా పెద్దది. ఫ్యామిలీ హీరోగా క్లీన్ ఇమేజ్ సొంతం చేసుకున్న వెంకటేష్ చేత బూతు డైలాగులు పలికిస్తే అది బాగుంది అనిపించకపోగా బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. ఇప్పటివరకు వెంకటేష్ తన కెరీర్లో చిన్న మచ్చ కూడా లేకుండా క్లీన్ ఇమేజ్తో ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నారు.
అలాంటి వెంకటేష్ తొలిసారిగా రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ మార్చి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికోసం దగ్గుబాటి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెంకీ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా రానా నాయుడు వెబ్ సిరీస్ పై ఆసక్తిగా ఉన్నారు. రానా నాయుడు ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో రానా రొమాంటిక్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు వెంకటేష్ నోటి వెంట వచ్చిన బూతు పదాలు చూస్తూ ఉంటే ఇది మరో లెవెల్ అరాచకం అన్నట్టుగా ఉందంటున్నారు. వాళ్ళిద్దరికీ అసలు ఇలాంటివి అసలు సూట్ కావని విమర్శించే వారు ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెంకటేష్ మాట్లాడుతూ రానా నాయుడు వెబ్ సిరీస్ కోసం కొన్ని బూతు పదాలు వాడాల్సి వచ్చిందని ఆ సమయంలోనే కాస్త ఇబ్బంది పడ్డానని పేర్కొన్నారు.
స్వయంగా ఆయనే ఆయన బూతు పదాలను జీర్ణించుకోలేక పోతున్నారు. మరి ఆయనను అభిమానించే ఫ్యామిలీ లేడీ ఫ్యాన్స్ వాటిని డైజేస్ట్ చేసుకోగలరా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. వెంకటేష్ నోటి వెంట అన్ని బూతు పదాలు వస్తుంటే క్లీన్ ఇమేజ్ ఉన్న వెంకటేష్ వంటి స్టార్ హీరో లాంటి పాత్రలో చేయడం ఇలాంటి డైలాగులను వాడటం సరికాదని అందులో ముక్తకంఠంతో చెబుతున్నారు. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి ఎన్నో ఫ్యామీలీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించిన వెంకీ నోటి వెంట బూతులు వద్దని అందరు ముక్తకంఠంతో చెబుతున్నారు. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో చూడాలంటే మార్చి 10వ తేదీ వరకు వెయిట్ చేయాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



