వెంకీమామ నెక్స్ట్ 3 ప్రాజెక్ట్స్ హిట్టవడం ఖాయమే!
on Apr 14, 2021
'ఎఫ్ 2', 'వెంకీమామ'`.. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్. ప్రస్తుతం ఈ సీనియర్ అగ్ర కథానాయకుడి చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ చిత్రాలే.. 'నారప్ప', 'దృశ్యం 2', 'ఎఫ్ 3'. కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'అసురన్' ఆధారంగా రూపొందుతున్న 'నారప్ప' మే 14న రిలీజ్ కానుండగా.. మాలీవుడ్ ఓటీటీ సెన్సేషన్ 'దృశ్యం 2'కి రీమేక్ గా తెరకెక్కుతున్న 'దృశ్యం 2' జూన్ లేదా జూలైలో రాబోతోంది. ఇక 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా తయారవుతున్న 'ఎఫ్ 3' ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ మూడు సినిమాల తరువాత మరో మూడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌ని వెంకీ లైన్ లో పెట్టారని ఫిల్మ్ నగర్ బజ్. వాటిలో ఒక సినిమాని 'పెళ్ళిచూపులు' ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చేయనున్న ఈ దగ్గుబాటి స్టార్.. మరో ప్రాజెక్టుని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ప్లాన్ చేశారని వినికిడి.
ఇక మూడో చిత్రం విషయానికి వస్తే 'విరాటపర్వం' దర్శకుడు వేణు ఊడుగులతో ఉండొచ్చని ప్రచారం సాగుతోంది. మరి.. వెంకీ నెక్స్ట్ 3 ప్రాజెక్ట్స్ లైనప్ మీద వస్తున్న వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
Also Read